సాక్షి, చెంగిచెర్ల: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పలు చోట్ల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ పోలీసు అధికారి కారులో డబ్బు తరలిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకుని దాడికి చేశారు.
వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా చెంగిచర్ల దగ్గర కారులో డబ్బుల సంచుల కలకలం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కారును అడ్డుకుని తనిఖీలు చేశారు. కారులో నగుదు ఉన్న సంచులను గుర్తించారు. అనంతరం, ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు వచ్చి నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావుగా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించారు. బీఆర్‌ఎస్ నేతలు కారులో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపణ చేశారు. దీంతో, ఆవేశంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త.. సీఐ అంజిత్ రావుపై దాడి చేశాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, దొరికిన డబ్బును మంత్రి మల్లారెడ్డికి చెందినది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment