జగిత్యాల జిల్లా: జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బత్తిని సంతోష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిందితుడి వివరాల్ని వెల్లడించారు.
నిందితుడు సంతోష్ గ్రామంలో గీతకార్మికుడు. నిందితునిపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. 15 సంవత్సరాలుగా నిందితుడికి భూ తగాదా కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టించింది కూడా గంగారెడ్డే. కొద్ది రోజుల క్రితం కేసు విషయంలో రాజీ కుదుర్చుకునేందుకు సంతోష్ ప్రయత్నించాడు. ఆ సమయంలో గంగారెడ్డి,సంతోష్ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి గంగారెడ్డిపై సంతోష్ కోపం పెంచుకున్నాడు. పథకం ప్రకారం బైక్‌పై హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు. అనంతరం హత్య ఎస్పీ తెలిపారు. నిందితుడి వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వివరించారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డిని 20 ఏళ్ల వయస్సున్న సంతోష్ అనే యువకుడు దారుణంగా హత మార్చాడు. పథకం ప్రకారం ముందుగా హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని వెంటాడి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన గంగారెడ్డిపై 20కిపైగా కత్తిపోట్లు పొడిచాడు. హత్య చేసి పారిపోతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డైంది. కొన ఊపిరితో ఉన్న ఆయనను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment