Jevan Reddy
-
జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం
జగిత్యాల జిల్లా: జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బత్తిని సంతోష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిందితుడి వివరాల్ని వెల్లడించారు. నిందితుడు సంతోష్ గ్రామంలో గీతకార్మికుడు. నిందితునిపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. 15 సంవత్సరాలుగా నిందితుడికి భూ తగాదా కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టించింది కూడా గంగారెడ్డే. కొద్ది రోజుల క్రితం కేసు విషయంలో రాజీ కుదుర్చుకునేందుకు సంతోష్ ప్రయత్నించాడు. ఆ సమయంలో గంగారెడ్డి,సంతోష్ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి గంగారెడ్డిపై సంతోష్ కోపం పెంచుకున్నాడు. పథకం ప్రకారం బైక్‌పై హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు. అనంతరం హత్య ఎస్పీ తెలిపారు. నిందితుడి వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వివరించారు.ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డిని 20 ఏళ్ల వయస్సున్న సంతోష్ అనే యువకుడు దారుణంగా హత మార్చాడు. పథకం ప్రకారం ముందుగా హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని వెంటాడి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన గంగారెడ్డిపై 20కిపైగా కత్తిపోట్లు పొడిచాడు. హత్య చేసి పారిపోతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డైంది. కొన ఊపిరితో ఉన్న ఆయనను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు.. హైడ్రాపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సాక్షి,హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. అక్రమ నిర్మాణాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి అని హై కోర్టు చెప్పిందని అన్నారు. పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదని తెలిపారు. అక్రమ నిర్మాణాల తొలగింపు ఒక ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. గత ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తున్నాం. అనుమతులకు భిన్నంగా అక్రమ నిర్మాణాలు కట్టినవాటి విషయంలో ఆయా శాఖలు స్పందిస్తాయి.నిరుపేదలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. -
రేవంత్‌ది టెంట్, అరవింద్‌ది స్టంట్ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో నాన్సెన్స్ రాజకీయాలు చేస్తూ న్యూసెన్స్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి టెంట్.., అరవింద్ స్టంట్ రాజకీయాలు తెలంగాణలో నడవబోవని, రేవంత్‌రెడ్డి కేవలం తెలంగాణకే కాకుండా కాంగ్రెస్ పారీ్టకి కూడా దుఖఃదాయకుడని విమర్శించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉపఎన్నికలో తేల్చుకోకుండా కేటీఆర్‌ను బహిరంగ చర్చకు రావాలని రేవంత్‌రెడ్డి సవాళ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీరా మాకు నీతులు చెప్పేది: చింతల సాక్షి, హైదరాబాద్: రాజకీయ అవకాశవాదంతో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు ఇలా అన్ని పారీ్టలతో అంటకాగిన టీఆర్ఎస్ నేతలా తమకు నీతులు చెప్పేది? అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ నేతలను ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితిలేదన్నారు. అన్ని ఇబ్బందుల్ని అధిగమించి మోదీ సర్కార్ దేశంలో వందకోట్ల డోస్‌ల కరోనా టీకాలకు చేరువైందని, ఈ సందర్భంగా వ్యాక్సిన్ సెంటర్లలో వైద్య సిబ్బందిని సన్మానించాలని బీజేపీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. -
కేటీఆర్ దిష్టిదొమ్మలు తగలబెట్టండి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. టీఆర్ఎస్ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. మంగళవారం గాంధీ భవన్లో మాజీ ఎంపీ మల్లురవి, టీపీసీసీ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయా కర్, కల్వ సుజాత, సుధీర్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోరాటం చేస్తుంటే.. కేసులు పెడుతూ, దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క కాం గ్రెస్ కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదని, వారి రక్షణ కోసం గాంధీ భవన్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం టీఆర్ఎస్కు అలవాటుగా మారిందని మల్లు రవి, దయాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు రోడ్లపై తిరగలేరన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పరువు పోగొట్టుకున్నారు కోర్టులో పరువునష్టం దావా వేసి మంత్రి కేటీఆర్ తన పరువు పోగొట్టుకున్నారని మల్లు రవి ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్‌ను కేటీఆర్ ఇప్పటికైనా స్వీకరించాలని అన్నారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మల్రెడ్డి ఆరోపించారు. భౌతిక దాడులు సరికాదు జగిత్యాలటౌన్: మాదక ద్రవ్యాల కేసులో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన టీఆర్ఎస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిపై భౌతికదాడులకు దిగడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌కు సినీ పరిశ్రమతో ఉన్న లోపాయికారి సంబంధాలే మాదకద్రవ్యాల కేసు విచారణకు అడ్డంకిగా మారాయని ఆరోపించారు. రేవంత్ సవాల్‌ను స్వీకరించి కేటీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. జగిత్యాలలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ సభలో రేవంత్ ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తే ఆయనపై కేసులు పెట్టడం ప్రభుత్వ నియంతృత్వధోరణికి అద్దం పడుతోందన్నారు. డ్రగ్స్ కేసును పక్కదారి పట్టించేందుకే రాహుల్ పేరు ను కేటీఆర్ ముందుకు తెస్తున్నారన్నారు. -
‘17 సెప్టెంబర్ ప్రాధాన్యత తెలియని వారు ఉండరు’
సాక్షి, జగిత్యాల : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఈ రోజు(సెప్టెంబర్ 17) ప్రాధాన్యత గురించి తెలియని వారంటూ ఉండరు అని అన్నారు. ఆగష్టు 15, 1947 తర్వాత హైదరాబాద్ రాజరిక పాలనలో ఉండేదని గుర్తుచేశారు. అలాగే నాడు భారతదేశాన్ని అస్థిరత చేసే విధంగా బ్రిటీషు వాళ్లు కుట్రలు ఉండేవని అన్నారు. హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానిక చేసిన సాయుధ పోరాటాలు, ఏ కులానికో, మతానికో వ్యతిరేకం కాదని, కావాలనే కొన్ని రాజకీయ శక్తులు దీన్ని కులాల ప్రాతిపదికన విభజన చేసే కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆనాడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్ధార్ వల్లాభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో కలిపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమం చివర్లో అమరులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. -
కవిత ఓటమికి కారణమదే: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యేల అసమర్థత, నిర్లక్ష్యమే టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత ఓటమికి కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విశ్లేషించారు. గత ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చిన హామీలను విస్మరించడం కూడా ఓటమికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత దారుణఓటమికి గురైన విషయం తెలిసిందే. అయితే కవిత ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కే కారణమని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జీవన్ రెడ్డి స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకైతే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిన ఓటుబ్యాంక్ ఎటుపోయిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల అసమర్థతే కవిత ఓటమికి కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతినిధిగా కాకపోయిన.. ప్రజాసేవకురాలిగా కవితకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. నిజామబాద్ ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలు దిశగా కార్యచరణ చేపట్టాలని సూచించారు. -
కాంగ్రెస్‌తోనే నిరుపేదలకు న్యాయం
రాయికల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని తాజామాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో సోమవారం జీవన్‌రెడ్డి సమక్షంలో సుమారు 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లు పాలించాలని టీఆర్ఎస్కు ప్రజలు అవకాశం ఇస్తే చాతకాని తనంతో 9 నెలల ముందే ఎన్నికల కోసం వెళ్లారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు, నిరుద్యోగులకు, కౌలు రైతులకు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, వికలాంగులకు పింఛన్, నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి, బీడీ కార్మికులకు, వితంతు, వృద్ధాప్య పింఛన్లు రూ.2 వేలు అందజేస్తామన్నారు. చెయ్యిగుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎద్దండి సిందూజ, కట్కం సులోచన, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, మమత, గన్నవరం ప్రభాకర్, బాపురపు నర్సయ్య పాల్గొన్నారు. -
ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం మోసం: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నాడని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ఉపకులాల్లో చిచ్చు పెట్టి, రాజకీయ ప్రయోజనం పొందాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో గిరిజనులకు 10% వరకూ రిజర్వేషన్లు పెంచుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయన్నారు. అయితే, రాష్ట్ర పరిధిలోని ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ కేంద్రానికి పంపించారని, దీనివల్ల గిరిజన రిజర్వేషన్ ఆలస్యమవుతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం, మోసపూరిత వైఖరి వల్ల ఇప్పటికే గిరిజనులు మూడు విద్యా సంవత్సరాలు కోల్పోయారన్నారు. మహారాష్ట్రలో ఆదివాసీలు బీసీలు అని, వారంతా ఇక్కడకు వచ్చి రిజర్వేషన్లు పొందడం వల్ల ఎస్టీల్లో ఆందోళన పెరుగుతుందన్నారు. ఇక్కడ ఉన్న ఆదివాసీలనే గిరిజనులుగా పరిగణించాలని సూచించారు. ఇంకా ఎస్టీ రిజర్వేషన్లపై ఆలస్యం చేయకుండా, వెంటనే ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. -
‘ఫాంహౌస్ గుట్టు త్వరలో రట్టవుద్ది’
సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సమయంలో సగం కూడా సచివాలయంలో గడపటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సచివాలయానికి రావటమే పెద్ద వార్తవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఫాంహౌస్ రహస్యం తొందర్లోనే బయటపడుతుందని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం అంటే టీఆర్ఎస్ స్థిరత్వమేనా అని ప్రశ్నించారు. ఆర్థిక స్థిరత్వం అర్థం కేసీఆర్ కుటుంబం ఆర్థికంగా బలపడటమేనా అని వ్యాఖ్యానించారు. ఆబ్కారీ ఆదాయం పెంచుకోవటం, ఫిరాయింపులను ప్రోత్సహించటంలో రాష్ట్రం దేశంలోనే ముందుందని చెప్పారు.