రాయికల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని తాజామాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో సోమవారం జీవన్‌రెడ్డి సమక్షంలో సుమారు 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లు పాలించాలని టీఆర్‌ఎస్‌కు ప్రజలు అవకాశం ఇస్తే చాతకాని తనంతో 9 నెలల ముందే ఎన్నికల కోసం వెళ్లారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు, నిరుద్యోగులకు, కౌలు రైతులకు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, వికలాంగులకు పింఛన్, నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి, బీడీ కార్మికులకు, వితంతు, వృద్ధాప్య పింఛన్లు రూ.2 వేలు అందజేస్తామన్నారు. చెయ్యిగుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎద్దండి సిందూజ, కట్కం సులోచన, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, మమత, గన్నవరం ప్రభాకర్, బాపురపు నర్సయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment