
ఓదెల: విజయరమణారావుకు స్వాగతం పలుకుతున్న మహిళలు
సాక్షి, ఓదెల: బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణరావు పేర్కొన్నారు. ఉప్పరపల్లె, హరిపురం, పిట్టలఎల్లయ్యపల్లె, కొలనూర్, కొమిర, నాంసానిపల్లె, తండా, అబ్బిడిపల్లె గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఓదెల జెడ్పీటీసీ గంట అక్షిత, మాజీ ఎంపీపీ గంట రాములు, పొత్కపల్లి మాజీ సింగిల్‌విండో చైర్మన్ నారాయణరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ బైరి రవిగౌడ్, నాయకులు మూల ప్రేంసాగర్‌రెడ్డి, చింతిరెడ్డి విజేందర్‌రెడ్డి, రేగుల తిరుపతి, ఎడవెల్లి జయపాల్‌రెడ్డి, మాజీ సర్పంచులు కనుకుంట్ల రాదరామస్వామి, శంకర్, కుంచం మల్లయ్య, పుప్పాల శంకర్, తిరుపతియాదవ్, రెడ్డి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చేరిక
ఉప్పరపల్లె, కొలనూర్, కునారం గ్రామాల పార్టీలకు చెందిన చిలుక శ్రీకాంత్, మ్యాకల అయోధ్య, కొమిరె రాజు, నిమ్మతి రవి, హరీశ్‌తోపాటు పలువురు విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment