సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నాడని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ఉపకులాల్లో చిచ్చు పెట్టి, రాజకీయ ప్రయోజనం పొందాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో గిరిజనులకు 10% వరకూ రిజర్వేషన్లు పెంచుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయన్నారు.
అయితే, రాష్ట్ర పరిధిలోని ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ కేంద్రానికి పంపించారని, దీనివల్ల గిరిజన రిజర్వేషన్ ఆలస్యమవుతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం, మోసపూరిత వైఖరి వల్ల ఇప్పటికే గిరిజనులు మూడు విద్యా సంవత్సరాలు కోల్పోయారన్నారు. మహారాష్ట్రలో ఆదివాసీలు బీసీలు అని, వారంతా ఇక్కడకు వచ్చి రిజర్వేషన్లు పొందడం వల్ల ఎస్టీల్లో ఆందోళన పెరుగుతుందన్నారు. ఇక్కడ ఉన్న ఆదివాసీలనే గిరిజనులుగా పరిగణించాలని సూచించారు. ఇంకా ఎస్టీ రిజర్వేషన్లపై ఆలస్యం చేయకుండా, వెంటనే ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment