సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సమయంలో సగం కూడా సచివాలయంలో గడపటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సమయంలో సగం కూడా సచివాలయంలో గడపటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సచివాలయానికి రావటమే పెద్ద వార్తవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఫాంహౌస్ రహస్యం తొందర్లోనే బయటపడుతుందని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం అంటే టీఆర్‌ఎస్ స్థిరత్వమేనా అని ప్రశ్నించారు. ఆర్థిక స్థిరత్వం అర్థం కేసీఆర్ కుటుంబం ఆర్థికంగా బలపడటమేనా అని వ్యాఖ్యానించారు. ఆబ్కారీ ఆదాయం పెంచుకోవటం, ఫిరాయింపులను ప్రోత్సహించటంలో రాష్ట్రం దేశంలోనే ముందుందని చెప్పారు.