పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు.. హైడ్రాపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి | MLC Jeevan Reddy Comments On Hydra | Sakshi
Sakshi News home page

పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు.. హైడ్రాపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

Published Mon, Sep 30 2024 2:03 PM | Last Updated on Mon, Sep 30 2024 2:46 PM

MLC Jeevan Reddy Comments On Hydra

సాక్షి,హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. అక్రమ నిర్మాణాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి అని హై కోర్టు చెప్పిందని అన్నారు. పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదని తెలిపారు. 

అక్రమ నిర్మాణాల తొలగింపు ఒక ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. గత ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తున్నాం. అనుమతులకు భిన్నంగా అక్రమ నిర్మాణాలు కట్టినవాటి విషయంలో ఆయా శాఖలు స్పందిస్తాయి.నిరుపేదలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement