సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ 85 మందికి సీట్లు కేటాయించగా వారిలో 51 మంది విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నా రు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన 79 మందిలో ఏడుగురు, బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన 57 మందిలో 19 మంది, ఏఐఎంఐఎం కేటాయించిన ఐదుగురిలో నలుగురు గెలిచా రు.
కాగా సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరా వుపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. 119 నియోజకవర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల అఫిడవిట్ల ఆధారంగా ఈ సంస్థలు బుధవారం ఒక నివేదికను విడుదల చేశాయి.
ఆస్తుల్లో అగ్రస్థానంలో వివేక్
ప్రధాన రాజకీయ పార్టీల నుంచి గెలిచిన 119 మందిలో 114 (96%) మంది కోటీశ్వరులు ఉన్నారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 60 (94%) మంది, బీఆర్‌ఎస్ నుంచి 38 (97%) మంది, బీజేపీ నుంచి 8 (100%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఏడుగురు (100%), సీపీఐకి చెందిన ఒకరు (100%) తమకు కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్న ట్లు వెల్లడించారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వివేకానంద్ (కాంగ్రెస్) తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి ప్రథమ స్థానంలో నిలిచారు.
రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రూ.433+ కోట్లతో పాలే రు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రూ.58+ కోట్లు, సిరిసిల్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తార క రామారావు రూ.53+ కోట్లు, సీఎల్పీ నాయకుడు, టీపీసీ సీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రూ.30+ కోట్ల ఆస్తులు ప్రకటించారు.
రూ.24+ లక్షలతో ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వె డ్మ బొజ్జు అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచా రు. రూ.28+ లక్షలతో దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ నెనావత్, రూ.56+లక్షలతో అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణలు తదుపరి స్థానా ల్లో ఉన్నారు. 2023లో గెలిచిన అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 38.88 కోట్లు కాగా.. 2018లో గెలిచిన ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.15.71 కోట్లు కావడం గమనార్హం.
అప్పుల్లో దానం టాప్
మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది తమకు రూ. కోటి కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయని ప్రకటించారు. రూ.49+ కోట్ల అప్పుతో ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రథమ స్థానంలో నిలిచారు. పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (రూ.43+ కోట్లు), చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ (రూ.41+ కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
96 మంది ఎమ్మెల్యేల వయసు 51 పైనే
తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో 23 (19%) మంది ఎమ్మెల్యేల వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండగా, 96 మంది (81%) ఎమ్మెల్యేలు 51–80 సంవత్సరాల మధ్య వయస్సుతో ఉన్నారు. అత్యంత ఎక్కువ వయస్సు ఉన్న ఎమ్మెల్యేగా బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి (74) నిలిచారు. అత్యంత పిన్న వయస్కులైన ఎమ్మెల్యేలుగా పాలకుర్తి నుంచి గెలుపొందిన యశస్విని (26), మెదక్ నుంచి గెలిచిన మైనంపల్లి రోహిత్ (26) నిలిచారు. కాగా కొత్త అసెంబ్లీలో 109 మంది పురుషులు, 10 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment