
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,నల్గొండ: కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు నల్గొండ జిల్లా పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాచర్ల మీదుగా ప్రయాణికుల వాహనాలను అనుమతించడం లేదు. నాగార్జునసాగర్ దాటిన తర్వాత ఆంధ్రాలోకి ప్రవేశించే మాచర్ల చెక్ పోస్టును ఆంధ్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుగా గుర్తించడం లేదు. అందువల్ల మాచర్ల మీదుగా ప్రయాణికుల వాహనాలను అనుమతించడం లేదని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. అందువల్ల మాచర్ల మీదుగా ఆంధ్రాలోకి వెళ్లాలనుకునే ప్రయాణికులు, వాహనాలు వాడపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. నాగార్జున సాగర్ వెళ్లడానికి వచ్చి ఆంధ్ర చెక్‌పోస్ట్ వద్ద ఇబ్బందులు పడొద్దని డీఎస్పీ సూచించారు.
చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment