నల్లగొండ క్రైం: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలుకు కానుక ఇవ్వాల్సిన అన్న ఆమె బంగారాన్నే దొంగలించాడు. చెల్లెకు బహుమతి ఇవ్వకుండా ఆమె సొత్తునే చోరీ చేసిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రమేశ్‌కు రాఖీ కట్టేందుకు ఈ నెల 21వ తేదీన ఆయన చెల్లెలు పోగుల లలిత వచ్చింది. లలిత ఆ రోజు అక్కడే ఉంది. అయితే, లలిత తన ఏడు తులాల బంగారు ఆభరణాలను బీరువాలో దాచిపెట్టింది. అదే బీరువాలో తండ్రి ముత్తయ్య రూ.10 వేల నగదును కూడా పెట్టాడు. వాటిపై కన్నేసిన అన్న అదును చూసి బంగారం, నగదును అపహరించాడు. చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా రమేశ్ నిర్వాకం బయటపడింది. అతడితోపాటు అతడి స్నేహితుడు వెలగల విజయ్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నగదు బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? )
చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు
రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ
Published Wed, Sep 1 2021 10:15 AM | Last Updated on Wed, Sep 1 2021 11:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment