తాగిన మత్తులో బావమరిదిని చంపాడు | Man kills sisters brother for thefting Rs.700 | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో బావమరిదిని చంపాడు

Published Tue, Jun 21 2016 9:35 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

Man kills sisters brother for thefting Rs.700

ధారూరు: తాగిన మైకంలో డబ్బుల కోసం బావమరిదిని బావ కర్రతో దాడిచేసి హత్య చేసిన సంఘటన మండలంలోని తరిగోపులలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వికారాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నాగ్ సాన్ పల్లి గ్రామానికి చెందిన దంపతులు బాలయ్య, పార్వతమ్మలు తరిగోపుల సమీపంలోని జహీర్ ఫాం హౌజ్ లో పనిచేస్తున్నారు. పార్వతమ్మ తమ్ముడు బోయ శ్రీనివాస్(30) వీరి పనిచేస్తున్న ఫాం హౌజ్ కు మూడు రోజులు క్రితం వచ్చాడు. వారితో పాటే ఫాంహౌజ్ లోనే పనిచేస్తున్న శ్రీనివాస్ తన బావ బాలయ్యకు తెలియకుండా అతని జేబులోంచి రూ.700లు తీసుకున్నాడు.

డబ్బు విషయంపై సోమవారం ఇరువురూ మద్యం సేవించి గొడవకు దిగారు. తన డబ్బు తీసుకుని తిరిగి తనపైనే దాడి చేయడానికి ప్రయత్నించిన శ్రీనివాస్ పై బాలయ్య కర్ర తీసుకుని దాడి చేశాడు. దెబ్బలు భరించలేని శ్రీనివాస్ ఫాం హౌజ్ నుంచి బయటకు పరుగులు తీసినా విడిచిపెట్టకుండా కర్రతో కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. హత్య కేసులో బాలయ్య, భార్య పార్వతమ్మల ప్రాతపై విచారణ జరుపుతున్నామని వివరించారు. నిందితుడు బాలయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement