
అరుణా రెడ్డికి ఆరో స్థానం
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ఆసియా సీనియర్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డికి మహిళల వాల్ట్ ఈవెంట్‌లో ఆరో స్థానం లభించింది. ఫైనల్లో అరుణ 12.825 స్కోరు సాధించింది. లియు జున్‌రు (చైనా–14.400 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... కిమ్ సు జాంగ్ (కొరియా–14.000 పాయింట్లు) రజతం, రై యోంగ్ (కొరియా–13.900) కాంస్యం సాధించారు.
హరికృష్ణ గేమ్‘డ్రా’
మాస్కో: భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మాస్కో ఓపెన్ గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. తెమూర్ రద్జబోవ్ (అజర్‌బైజాన్)తో ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. తొమ్మిదో రౌండ్ తర్వాత హరికృష్ణ ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి.