
సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్ రామ్. దీంతో ఆయన ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా బింబిసార టీం యాంకర్ సుమతో. కల్యాణ్ రామ్, సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇతర టీం కలిసి సుమతో లంచ్ చేస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
చదవండి: ప్రస్తుత టాలీవుడ్ కష్టాలకు కారణం డైరెక్టర్ రాజమౌళి: వర్మ
కాగా ఈ మూవీ టైం ట్రావెలర్ నేపథ్యంలో రూపొందడంతో సుమ ఈ ప్రశ్నతోనే ఇంటర్య్వూను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కీరవాణిని మీరు టైం ట్రావెల్ అవ్వాలనుకుంటే ఏం చేంజ్ చేయాలనుకుంటారని అడగ్గా.. కీరవాణి తాను 2018 ఆగస్ట్ 28కి వెళ్తానన్నారు. ‘అప్పుడు నేను హరికృష్ణ గారికి కాల్ చేసి మనం కంపోజింగ్ పెట్టుకుందాం, ఓ రెండు రోజులు నాతో ఉండిపోండి అని చెప్పేవాడి. అలా చెప్పడం వల్ల ఆయన ఆగస్ట్ 29న జర్నీ చేయరు కదా. ఎందుకంటే హరికృష్ణ గారికి నా కంపోజింగ్ అంటే చాలా ఇష్టం. నేను అలా కాల్ చేసుంటే కచ్చితంగా ఆయన నాతోనే ఉండేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సుమ కల్యాణ్ రామ్‌ని మీ తండ్రి చనిపోయిన రోజు ఎక్కడ ఉన్నారని అడగ్గా.. తాను ఇంట్లోనే ఉన్నానన్నాడు.
చదవండి: సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్‌తో చై చర్చలు.. అందుకేనా?
‘ఉదయం 5:30 ఆ సమయంలో నేను ఇంట్లో బాల్కానిలో కూర్చోని టీ తాగుతున్నా. అప్పుడే నాకు శివాజీ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అప్పుడు ఆయన నాన్నతో(హరికృష్ణ) కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఏమైందా అని శివాజీ గారు శివాజీ గారు అని అన్నాను. కానీ అప్పటికే కాల్ కట్ అయ్యింది’ అని చెప్పాడు. ఆ తర్వాత తన మావయ్యకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి అదే సమయంలో విజయవాడకు వెళ్తూ నాకు కాల్ చేసి.. కొన్ని ఫొటోలు పంపించారని గుర్తు చేసుకుని కల్యాణ్ రామ్ ఏమోషనల్ అయ్యాడు. కాగా 2018 ఆగస్ట్ 29న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఆయన సోదరి, కల్యాణ్ రామ్ మేనత్త ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment