
బుద్దా అరుణరెడ్డి
ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో చివరిరోజు భారత జిమ్నాస్ట్‌లకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన మహిళల ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ఏడో స్థానంలో నిలిచింది. ఆమె 10.833 పాయింట్లు స్కోరు చేసింది. పారలల్ బార్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన రాకేశ్ పాత్రా 13.433 స్కోరుతో ఏడో స్థానాన్ని పొందాడు. శనివారం వాల్ట్ ఈవెంట్‌లో అరుణ రెడ్డి కాంస్యం గెలిచి ఈ మెగా ఈవెంట్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
Creates History By Clinching At The Gymnastics World Cup
Comments
Please login to add a commentAdd a comment