జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకం సాధించిన అరుణా రెడ్డి
మెల్‌బోర్న్ : జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో అరుణా రెడ్డి కాంస్య పతకం గెలుపొందిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో స్లొవేనియాకు చెందిన కైసెల్ప్, ఆస్ర్టేలియా క్రీడాకారిణి వైట్‌హెడ్‌లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. 13.369 పాయింట్ల స్కోర్‌తో అరుణా రెడ్డి కాంస్య పతకం దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో కైసెల్ఫ్ 13.800, వైట్‌హెడ్ 13.699 పాయింట్ల స్కోర్ సాధించారు.
జిమ్నాస్టిక్స్ బరిలో నిలిచిన రెండవ భారతీయురాలు ప్రణతి నాయక్ 13.416 స్కోర్‌తో ఆరవ స్ధానంలో నిలిచారు. అరుణా రెడ్డి సాధించిన పతకం జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయ స్ధాయిలో భారత్‌కు మూడవ మెడల్ కావడం గమనార్హం. 2010 న్యూఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయుడిగా అశిష్‌కుమార్ నిలిచారు. 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌లో దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం దక్కించుకున్నారు.22 ఏళ్ల అరుణా రెడ్డి కరాటేలో బ్లాక్‌బెల్ట్ పొందారు. ఆమె గతంలో జిమ్నాస్టిక్స్‌లో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment