
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తన వాహన శ్రేణిలో మరో కొత్త ఎస్‌యూవీను తీసుకురానుంది. అందుకు సంబంధించిన టీజర్‌ను కియా రిలీజ్ చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీ పేరును కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కాగా కియా కార్లలోని స్పోర్టేజ్ ఎస్‌యూవీ మోడల్‌కు కొత్త జనరేషన్ కారుగా ఈ కారు నిలుస్తోందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.
తొలుత అమెరికన్ మార్కెట్లలో ఈ కారును అక్టోబర్ 27 న లాంచ్ చేయనున్నుట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లలోకి కియా న్యూ ఎస్‌యూవీ మోడల్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కియా నుంచి వస్తోన్న ఈ కారు ఫ్రంట్ వీల్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్‌తో రానుంది. కారులో మల్టీపుల్ స్టాండర్డ్ అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, హై టెక్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. టీజర్‌లో భాగంగా ఈ కారులో టైగర్ నోస్ గ్రిల్ బోల్డ్ ఫ్రంట్ ఫేస్‌తో కారు ముందుభాగం ఉండనుంది. బూమ్‌ర్యాంగ్ ఆకారంలో ఫ్రంట్ ఎల్‌ఈడీ లైట్లను కల్గి ఉంది.
ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే..!
ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో కారు ఇంజిన్ ముందు టైర్లకు శక్తినిస్తోంది.
ఆల్ వీల్ డ్రైవ్ అంటే..!
ఈ ఆప్షన్‌లో ఇంజిన్ కారు ముందు టైర్లకు, వెనుక టైర్లకు శక్తిని అందిస్తోంది
ఇంజిన్ విషయానికి వస్తే..!
కియా స్పోర్టేజ్ మోడల్ మాదిరిగానే 1.6 లీటర్ టర్బో ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. 177 బీహెచ్‌పీ సామర్థ్యంతో 265ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.
చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...!
Comments
Please login to add a commentAdd a comment