భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో 'సోనెట్ ఆరోక్స్' (Sonet Aurochs) అనే కొత్త ఎడిషన్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ హెచ్‌టిఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ కియా కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర & కలర్ ఆప్షన్స్
మార్కెట్లో అడుగుపెట్టిన కియా కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.85 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 లీటర్ పెట్రోల్ iMT, 1.0 లీటర్ పెట్రోల్ DCT, 1.5 లీటర్ డీజిల్ iMT, 1.5 లీటర్ డీజిల్ AT. కియా సోనెట్ ఆరోక్స్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. అవి గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్.
డిజైన్
సోనెట్ ఆరోక్స్ గతంలో అమ్ముడైన యానివెర్సరీ ఎడిషన్ మాదిరిగానే ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, సెంటర్ వీల్ క్యాప్స్, గ్రిల్, డోర్ గార్నిష్, సైడ్ స్కిడ్ ప్లేట్‌లపై టాన్జేరిన్ యాక్సెంట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో Aurochs బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్ కలిగి రియర్ ఫ్రొఫైల్ లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.
ఫీచర్స్
2023 సోనెట్ ఆరోక్స్ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.
(ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!)
ఇంజిన్ & స్పెసిఫికేషన్స్
కొత్త సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment