
కియా మోటార్స్ (Kia Motors) 2024 జనవరిలో కొత్త 'సోనెట్' లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన కేవలం 11 నెలల్లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను పొందింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి నవంబర్ 2024 వరకు ఈ కారు అమ్మకాలు 1,03,353 యూనిట్లు.
కియా సోనెట్ (Kia Sonet) మొత్తం అమ్మకాల్లో పెట్రోల్ మోడల్స్ 76 శాతం కాగా.. 24 శాతం మంది డీజిల్ కార్లను కొనుగోలు చేసారు. మరో 34 శాతం మంది ఆటోమాటిక్ ఐఎంటీ వేరియంట్స్ కొనుగోలు చేశారు. కాగా సోనెట్ కారును కియా కంపెనీ మూడు ఇంజిన్ ఆప్షన్లలో విక్రయిస్తోంది.
సోనెట్ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటివి పొందుతుంది. వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెవెల్ 1 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 79 శాతం మంది సన్‌రూఫ్‌లతో కూడిన సోనెట్ వేరియంట్‌లను కొనుగోలు చేశారు.
టాటా నెక్సాన్ (Tata Nexon), మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue), మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, స్కోడా కైలాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కియా సోనెట్ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.77 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.