హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా దేశీయంగా 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంటులో 2019 ఆగస్ట్ నుంచి తయారీ ప్రారంభం అయింది. ఈ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 3 లక్షల యూనిట్లు.
(ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!)
అనంత ప్లాంటు నుంచి తొలుత సెల్టోస్ మోడల్ కారు రోడ్డెక్కింది. ఇప్పటి వరకు 5.3 లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. కాగా, కియా ఇండియా కొత్త సెల్టోస్‌ను గురువారం ప్రవేశపెట్టింది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం.
Comments
Please login to add a commentAdd a comment