భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, టాటా ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్స్ విడుదలయ్యాయి. ఈ ఆధునిక ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా ఆల్ట్రోజ్..
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ మార్కెట్లో XM, XM(S) అనే రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 6.90 లక్షలు, రూ. 7.35 లక్షలు. ఆల్టోజ్ కొత్త వేరియంట్స్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.
ఇందులో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్ మరియు వీల్ కవర్‌తో కూడిన 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అయితే ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున అదే పనితీరుని అందిస్తుంది.
(ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!)
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్..
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సెల్టోస్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధరలు రూ. 10.90 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధరలు రూ. 20 లక్షల (ధరలు ఎక్స్,షోరూమ్,ఢిల్లీ) వరకు ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ అప్డేటెడ్ మోడల్ కోసం 13,424 బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం.
(ఇదీ చదవండి: భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ హెడ్‌కౌంట్.. గడ్డు కాలంలో ఐటీ ఉద్యోగులు!)
డిజైన్ అండ్ స్టైలింగ్ పరంగా ఇది చాలా ఆధునికంగా ఉంటుంది. కాగా ఇది కొత్త కలర్ ఆప్షన్‍లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది పెట్రోల్, టర్బో డీజిల్ వంటి ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. కావున పనితీరు పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment