ఏడాది తర్వాత మళ్ళీ వస్తున్న కారు.. రేపటి నుంచే బుకింగ్స్ | New Gen Kia Carnival Bookings Start From 16 September 2024 | Sakshi

ఏడాది తర్వాత మళ్ళీ వస్తున్న కారు.. రేపటి నుంచే బుకింగ్స్

Sep 15 2024 6:17 PM | Updated on Sep 15 2024 6:17 PM

New Gen Kia Carnival Bookings Start From 16 September 2024

కియా మోటార్స్ (Kia Motors) దేశంలో తన కార్నివాల్ ఎంపీవీని నిలిపివేసిన సుమారు సంవత్సరం తరువాత మళ్ళీ సరికొత్త కారుగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అంతకంటే ముందు సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

కియా కంపెనీ తన కొత్త తరం కార్నివాల్ కోసం బుకింగ్స్ సెప్టెంబర్ 16 నుంచి స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 2 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది అక్టోబర్ 3న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది.

త్వరలో లాంచ్ కానున్న సరికొత్త కిస్ కార్నివాల్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ కొన్ని అప్డేట్స్ పొంది ఉండటం చూడవచ్చు. వర్టికల్ హెడ్‌లైట్స్, టైగర్ నోస్ గ్రిల్, వెనుక భాగంలో లైట్‌బార్ ద్వారా కనెక్ట్ అయిన స్లిమ్ వర్టికల్ టెయిల్‌ల్యాంప్‌ ఇందులో చూడవచ్చు.

ఇదీ చదవండి: ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్‌సీపీఐ కీలక నిర్ణయం

కొత్త కియా కార్నివాల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు టచ్‌స్క్రీన్, డ్యూయల్ సన్‌రూఫ్‌, 12 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ పొందుతుంది. వెనుక సీటు ప్రయాణికులు పవర్ ఆపరేటెడ్ స్లైడింగ్ డోర్లు, లెగ్ రెస్ట్‌లు, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన మధ్య వరుస సీట్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement