Kia Motors
-
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!
మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, స్కోడా & నిస్సాన్ వంటి ప్రధాన వాహన తయారీదారులు భారతీయ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో స్కోడా కైలాక్, అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ, కియా సిరోస్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ వంటివి ఉన్నాయి.స్కోడా కైలాక్స్కోడా కంపెనీ 2025 మార్చిలో కైలాక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఇది MQB A0 IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారువుతోంది. కాబట్టి కుషాక్లోని చాలా ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో 1.0 లీ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూహ్యుందాయ్ వెన్యూ అప్డేటెడ్ మోడల్ 2025 మధ్య నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది చూడటానికి సాధారణ వెన్యూ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్, లేటెస్ట్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే మెకానికల్ అప్డేట్స్ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.కియా సిరోస్కియా కంపెనీ సిరోస్ కారును 2025 మొదటి అర్ధభాగంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది సోనెట్, సెల్టోస్ మధ్యలో ఉంటూ.. సోనెట్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సన్‌రూఫ్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉండనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్లిఫ్ట్ఇప్పటికే రెండు లక్షల అమ్మకాలను సాధించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. 2025 మధ్య నాటికి ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ పొందనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పనితీరు దాని స్టాండర్డ్ మోడల్ కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ధర, లాంచ్ డేట్ వంటి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. -
ఏడాది తర్వాత మార్కెట్లో లాంచ్ అయిన కారు.. ధర ఎంతంటే?
ఇండియన్ మార్కెట్లో నాల్గవ తరం కియా కార్నివాల్ లాంచ్ అయింది. దీని ధర రూ. 63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది కేవలం డీజిల్ ఇంజన్‌తో 7 సీటర్‌గా మాత్రమే లభిస్తుంది. ఈ కారు ప్రస్తుతం సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశానికి దిగుమతి అవుతుంది.సరికొత్త కియా కార్నివాల్ భారతదేశంలో తయారైతే ధర కొంత తగ్గుతుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్కు ప్రత్యర్థిగా ఉన్న కార్నివాల్.. కోసం కంపెనీ రూ. 2 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. ఈ లేటెస్ట్ కారు దాని మునుపటి మోడల్ కంటే చాలా హుందాగా ఉంటుంది.టైగర్ నోస్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు 18 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉన్న ఈ కారు ఎల్ఈడీ టెయిల్-లైట్స్ పొందుతుంది. ఈ కారు రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది.2024 కియా కార్నివాల్ 12.3 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పవర్డ్ స్లైడింగ్ రియర్ డోర్లను పొందుతుంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్, ఏడీఏఎస్ ఫీచర్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.ఇదీ చదవండి: భారీగా పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవేకొత్త కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 441 Nm టార్క్, 193 Hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కంపెనీ ఈ కారుకు మూడు సంవత్సరాల ఫ్రీ మెయినెనెన్స్, వారంటీ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివి అందిస్తుంది. -
నాలుగేళ్లలో.. ఈ కారును 4.5 లక్షల మంది కొనేశారు
నాలుగు సంవత్సరాల క్రితం దేశీయ విఫణిలో విడుదలైన కియా ఇండియా మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్యూవీ 'సోనెట్' అమ్మకాలు ఏకంగా నాలుగు లక్షలు దాటింది. ఎస్ఐఏఎమ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 3,57,743 లక్షల విక్రయాలు, ఎగుమతులు 92,069 యూనిట్లు నమోదైనట్లు తెలుస్తోంది.మొత్తం నాలుగేళ్లలో కియా సోనెట్ సేల్స్ 4,49,812 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో సోనెట్ విక్రయాలు 63,717 యూనిట్లు, కాగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో 44,582 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు, కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడింది.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఎగుమతుల విషయానికి వస్తే.. కియా సోనెట్ విక్రయాలు 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగినట్లు (30,574 యూనిట్లు) తెలుస్తోంది. ప్రారంభంలో ఎగుమతులు నెమ్మదిగా సాగి ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ ఎస్యూవీను ఇష్టపడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరగటం వల్ల ఈ అమ్మకాలు సాధ్యమయ్యాయి. -
ఏడాది తర్వాత మళ్ళీ వస్తున్న కారు.. రేపటి నుంచే బుకింగ్స్
కియా మోటార్స్ (Kia Motors) దేశంలో తన కార్నివాల్ ఎంపీవీని నిలిపివేసిన సుమారు సంవత్సరం తరువాత మళ్ళీ సరికొత్త కారుగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అంతకంటే ముందు సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.కియా కంపెనీ తన కొత్త తరం కార్నివాల్ కోసం బుకింగ్స్ సెప్టెంబర్ 16 నుంచి స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 2 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది అక్టోబర్ 3న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది.త్వరలో లాంచ్ కానున్న సరికొత్త కిస్ కార్నివాల్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ కొన్ని అప్డేట్స్ పొంది ఉండటం చూడవచ్చు. వర్టికల్ హెడ్‌లైట్స్, టైగర్ నోస్ గ్రిల్, వెనుక భాగంలో లైట్‌బార్ ద్వారా కనెక్ట్ అయిన స్లిమ్ వర్టికల్ టెయిల్ల్యాంప్ ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయంకొత్త కియా కార్నివాల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు టచ్‌స్క్రీన్, డ్యూయల్ సన్‌రూఫ్, 12 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ పొందుతుంది. వెనుక సీటు ప్రయాణికులు పవర్ ఆపరేటెడ్ స్లైడింగ్ డోర్లు, లెగ్ రెస్ట్లు, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన మధ్య వరుస సీట్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. -
కొరియన్ బ్రాండ్ కీలక నిర్ణయం.. ఇండియాలో 1138 కార్లు వెనక్కి
భారతీయ విఫణిలో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. తన ఈవీ6 కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్లకు ఎందుకు రీకాల్ ప్రకటించింది? ఎన్ని కార్లపై ఈ ప్రభావం చూపుతుంది అనే విషయాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..కియా ఈవీ6 కార్లలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో ఏర్పడిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇది 1138 యూనిట్లపై ప్రభావం చూపుతుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి కంపెనీ స్వచ్చందంగానే రీకాల్ ప్రకటించింది. ఐసీసీయూ లోపం 12 వోల్ట్స్ బ్యాటరీ పనితీరు మీద ప్రభావం చూపుతుంది.2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన కియా ఈవీ6 కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. లోపాన్ని సరిచేయడానికి కంపెనీ కారులోని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది. దీనికోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన పని లేదు. కంపెనీ త్వరలోనే కస్టమర్లకు ఈ సందేశాన్ని పంపిస్తుంది. -
ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు.. ఇవే!
2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్‌లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఎక్స్యువీ300 ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్యువీ300 కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్‌కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..
భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు కొత్త కార్లను & బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కియా కారెన్స్ ఎక్స్-లైన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా కంపెనీకి చెందిన కారెన్స్ ఇప్పుడు ఎక్స్-లైన్ రూపంలో విడుదలైంది. ఈ కొత్త కారు ధరలు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.44 వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ తాజాగా ఇండియన్ మార్కెట్లో అడుగెట్టిన నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ధరలు ఈ రోజు అధికారికంగా వెలువడ్డాయి. దీని ధర రూ. 8.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ ఎమ్టీ, టర్బో పెట్రోల్ ఎమ్టీ, టర్బో-పెట్రోల్ సీవీటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జిటి ప్లస్ మ్యాట్ వర్టస్ వెర్షన్ ఇటీవల జిటి ప్లస్ మ్యాట్ ఎడిషన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ. 17.62 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కేవలం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో మాన్యువల్ అండ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి లాంబోర్గినీ రెవెల్టో ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ విఫణిలో 'రెవెల్టో' అనే కొత్త కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 8.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & 3.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇందులోని 6.5 లీటర్ వి12 ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. -
భారత్‌లో విడుదలైన లేటెస్ట్ కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, టాటా ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్స్ విడుదలయ్యాయి. ఈ ఆధునిక ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా ఆల్ట్రోజ్.. దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ మార్కెట్లో XM, XM(S) అనే రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 6.90 లక్షలు, రూ. 7.35 లక్షలు. ఆల్టోజ్ కొత్త వేరియంట్స్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి. ఇందులో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్ మరియు వీల్ కవర్‌తో కూడిన 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అయితే ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున అదే పనితీరుని అందిస్తుంది. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్.. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సెల్టోస్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధరలు రూ. 10.90 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధరలు రూ. 20 లక్షల (ధరలు ఎక్స్,షోరూమ్,ఢిల్లీ) వరకు ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ అప్డేటెడ్ మోడల్ కోసం 13,424 బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. (ఇదీ చదవండి: భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ హెడ్‌కౌంట్.. గడ్డు కాలంలో ఐటీ ఉద్యోగులు!) డిజైన్ అండ్ స్టైలింగ్ పరంగా ఇది చాలా ఆధునికంగా ఉంటుంది. కాగా ఇది కొత్త కలర్ ఆప్షన్లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది పెట్రోల్, టర్బో డీజిల్ వంటి ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. కావున పనితీరు పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. -
అదరగొట్టిన కియా.. ఉత్పత్తిలో కొత్త మైలురాయి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా దేశీయంగా 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంటులో 2019 ఆగస్ట్ నుంచి తయారీ ప్రారంభం అయింది. ఈ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 3 లక్షల యూనిట్లు. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) అనంత ప్లాంటు నుంచి తొలుత సెల్టోస్ మోడల్ కారు రోడ్డెక్కింది. ఇప్పటి వరకు 5.3 లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. కాగా, కియా ఇండియా కొత్త సెల్టోస్‌ను గురువారం ప్రవేశపెట్టింది. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం. -
ఆధునిక హంగులతో కొత్త సెల్టోస్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
Kia Seltos Facelift Debut: సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ 'కియా మోటార్స్' దేశీయ మార్కెట్లో 'సెల్టోస్' విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇందులో ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించింది. భారతీయ విఫణిలో విడుదలకానున్న కొత్త 'కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' (Kia Seltos Facelift) గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్స్ కియా మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త 'సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' కోసం సంస్థ జులై 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. 2019లో ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత 2022లో ప్రపంచ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఐదు లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఇప్పుడు కొత్త రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్ సాధారణ మోడల్ కంటే కూడా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కొంచెం పెద్ద బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లో బాడీ కలర్ ఇన్సర్ట్లు, గ్రిల్‌లోకి విస్తరించే ఉండే కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్లతో రీడిజైన్ హెడ్లైట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వెనుక భాగంలో కొత్త ఇన్వర్టెడ్ ఎల్ షేప్ టెయిల్ లైట్లు ఉన్నాయి. ఫీచర్స్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో రెండు 10.25 ఇంచెస్ డిస్ప్లేలతో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఏసీ వెంట్స్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ హెడ్స్-అప్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) సేఫ్టీ ఫీచర్స్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కియా మోటార్స్ కొత్త సెల్టోస్ ఫేస్లిఫ్ట్లోఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. అంతే కాకుండా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 17 కంటే ఎక్కువ ADAS ఫీచర్స్ కలిగి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) పవర్‌ట్రెయిన్ 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 115 hp పవర్ 144 Nm టార్క్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ & 116 hp పవర్, 250 Nm టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVTని.. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ iMT అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇవి కొత్త నిబంధలను అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. -
త్వరలో విడుదలకానున్న కొత్త కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వంటి అత్యంత ఖరీదైన కార్లు దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. కాగా వచ్చే నెలలో కూడా కొన్ని కార్లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఇన్విక్టో, హ్యుందాయ్ ఎక్స్టర్, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా 2023 జులై 5న ఇన్విక్టో అనే కొత్త ఎంపివిని విడుదల చేయనుంది. కంపెనీ దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 25,000 టోకెన్ మొత్తంతో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్'. కంపెనీ రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరిస్తుంది. ఇది జులై 10న అధికారికంగా విడుదలకానున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు సింగిల్ అండ్ డ్యూయెల్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?) హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్‌పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న కియా సెల్టోస్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ ట్వీక్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ లాంప్స్ వంటి వాటితో పాటు సరి కొత్త బంపర్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్‌లో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 115 హార్స్పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు.. 116 హార్స్పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ కారుకి సంబంధించిన అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు. జులై మధ్య నాటికి లేదా చివరి నాటికి అధికారిక ధరలు తెలుస్తాయి. -
కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో 'సోనెట్ ఆరోక్స్' (Sonet Aurochs) అనే కొత్త ఎడిషన్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ హెచ్టిఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ కియా కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ మార్కెట్లో అడుగుపెట్టిన కియా కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.85 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 లీటర్ పెట్రోల్ iMT, 1.0 లీటర్ పెట్రోల్ DCT, 1.5 లీటర్ డీజిల్ iMT, 1.5 లీటర్ డీజిల్ AT. కియా సోనెట్ ఆరోక్స్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. అవి గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్. డిజైన్ సోనెట్ ఆరోక్స్ గతంలో అమ్ముడైన యానివెర్సరీ ఎడిషన్ మాదిరిగానే ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, సెంటర్ వీల్ క్యాప్స్, గ్రిల్, డోర్ గార్నిష్, సైడ్ స్కిడ్ ప్లేట్లపై టాన్జేరిన్ యాక్సెంట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో Aurochs బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్ కలిగి రియర్ ఫ్రొఫైల్ లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఫీచర్స్ 2023 సోనెట్ ఆరోక్స్ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & స్పెసిఫికేషన్స్ కొత్త సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. -
రికార్డు స్థాయిలో కియా ఎగుమతులు - ఏకంగా..
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా 2 లక్షల ఎగుమతుల మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 95 దేశాలకు కార్లను ఎగుమతి చేసినట్లు సంస్థ వెల్లడించింది. మధ్యప్రాచ్యం, మెక్సికో తదితర ప్రాంతాల నుంచి భారీ డిమాండ్ నెలకొందని తెలిపింది. ఎగుమతుల్లో సెల్టోస్ కార్లు అత్యధికంగా 1,35,885 యూనిట్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. 2023 మార్చి త్రైమాసికంలో ఎగుమతులు 22% పెరిగినట్లు వివరించింది. -
మార్కెట్లో కియా నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ ఇప్పుడు 'లగ్జరీ (ఓ)' వెర్షన్ రూపంలో విడుదలైంది. ఈ లేటెస్ట్ కారు చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ధరలు, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ధరలు రూ. 17 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ కారు రియల్ డ్రైవ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతుంది, కావున డెలివరీలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!) కియా కారెన్స్ లగ్జరీ వేరియంట్ మాన్యువల్ వెర్షన్ అమ్మకానికి లేదు, ఇది కేవలం 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎంచుకున్న డ్రైవ్ మోడ్ వంటివి మారుతాయి. ఇప్పటికే ఉన్న లగ్జరీ ట్రిమ్ మాత్రమే 6 సీటర్‌గా లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్: కియా కారెన్స్ లగ్జరీ (ఓ) డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో 16 ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్స్ చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో లెదర్డ్ స్టీరింగ్ వీల్, రెండవ వరుసలలో కూల్డ్ కప్హోల్డర్లు, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు నాలుగు స్పీకర్లు, ఐదు USB C-టైప్ ఛార్జర్ వంటివి పొందుతుంది. అన్ని సీట్లు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు కలిగి ఉంటాయి. సేఫ్టీ ఫీచర్స్: కొత్త కియా కారెన్స్ ఇతర అన్ని మోడల్స్ మాదిరిగానే డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి కావున వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రత లభిస్తుంది. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ట్రిమ్ కేవలం ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో మాన్యువల్ ఆప్షన్ లేదు. కావున ఇందులోని 1.5 లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ DCTతో 160 హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ కలిగి 116 హెచ్‌పి పవర్ అందిస్తుంది. (ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా కారెన్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ధరల పరంగా కారెన్స్ ఎక్కువ అయినప్పటికీ ఆధునిక ఫీచర్స్, శక్తివంతమైన ఇంజిన్ లభిస్తాయి. -
2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!
సాక్షి,ముంబై: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్. కియా ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనం ఈవీ 6 2023 వెర్షన్ బుకింగ్‌లను షురూ చేస్తోంది. ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. 2023 ఈవీ6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీటీ లైన్ , జీటీ GT లైన్ AWD. వీటి ధరలు వరుసగా రూ. 60.95 లక్షలు, రూ. వరుసగా 65.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!) గత ఏడాది తమ పాపులర్ కారును అందుకోలోలేకపోయిన వారి కోసం తమ డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించామనీ, మార్కెట్లో అద్భుతమైన పనితీరుతో ఈవీ6 ప్రీమియం ఈవీ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతుందనే విశ్వసాన్ని కియా ఇండియా సీఎండీ తే జిన్ పార్క్ ప్రకటించారు. 2022లో 432 యూనిట్ల విక్రయించిన కంపెనీ, 150 kW హై-స్పీడ్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రస్తుతం ఉన్న 15 డీలర్‌షిప్‌ల నుండి మొత్తం 60 అవుట్లెట్లకు విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. (2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే) -
Kia Carnival facelift: కియా మోటార్స్ నుంచి కొత్త కారు.. భారత్‌కి వస్తుందా?
భారతదేశంలో 7 సీటర్ విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 'కియా కార్నివాల్' త్వరలోనే మరిన్ని కొత్త హంగులతో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నాల్గవ తరం కియా కార్నివాల్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. నాల్గవ తరం కియా కార్నివాల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభం కాలేదు, అయితే ప్రస్తుతం సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉంది. ఈ లేటెస్ట్ కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే కొత్త డిజైన్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వంటి వాటిని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్ & ఫీచర్స్: కొత్త కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త కియా ఈవి9 మాదిరిగా ఉంటుంది. కావున వర్టికల్ హెడ్‌ల్యాంప్ డిజైన్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కలిగి రీడిజైన్ బోనెట్ పొందుతుంది. అల్లాయ్ వీల్స్ దాదాపు మారే అవకాశం లేదు. రియర్ ఫ్రొఫైల్లో టెయిల్ లాంప్ కొత్తగా ఉంది. కారు పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల మొత్తం డిజైన్ వెల్లడి కాలేదు. నాల్గవ తరం కియా కార్నివాల్ డిజైన్ కొంత వరకు వెల్లడైంది, కానీ ఫీచర్స్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు, రానున్న రోజుల్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్ వెల్లడవవుతాయి. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్: కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ గురించి అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే లేటెస్ట్ కార్నివాల్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందనుంది. ప్రస్తుతం ఈ ఎంపివి 2.2 లీటర్ డీజిల్, 3.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉంది. (ఇదీ చదవండి: Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..) లాంచ్ టైమ్: కియా కార్నివాల్‌ను కంపెనీ ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో KA4 ఎంపివిగా ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది, అదే సమయంలో కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి నాటికి గ్లోబల్ మార్కెట్లో విడుదలవుతుందని భావిస్తున్నారు. అంచనా ధర: కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది విడుదలకానున్న కియా కేఏ4 ధర రూ. 50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవవుతాయి. -
2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' భారతీయ మార్కెట్లో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేటెడ్ కారెన్స్ విడుదల చేసింది. ఇది అప్డేటెడ్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే కాకుండా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: అప్డేటెడ్ కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు వేరియంట్స్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 18.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే టర్బో-పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ధరలు దాని మునుపటి మోడల్ కంటే రూ. 50,000, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 25,000 ఎక్కువ. ఇంజిన్ ఆప్సన్స్: కొత్త కియా కారెన్స్ E20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిక్స్డ్) కంప్లైంట్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ రాబోయే BS6 ఫేజ్ 2 & RDE ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండి 157.8 బిహెచ్పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది. (ఇదీ చదవండి: మారుతి బ్రెజ్జా సిఎన్జి కావాలా.. ఇప్పుడే బుక్ చేసుకోండి!) డిజైన్ & ఇంటీరియర్ ఫీచర్స్: 2023 కియా కారెన్స్ డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 4.2 ఇంచెస్ కలర్ MIDతో 12.5 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బోస్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్: ఆధునిక కాలంలో డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాహనాలను కొనుగోలుచేయడానికి కస్టమర్లు ఎక్కువ ఆస్కతి చూపుతున్నారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. 2023 కారెన్స్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX మౌంట్లు, హిల్-హోల్డ్ అసిస్టెన్స్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..) ప్రత్యర్థులు: అప్డేటెడ్ కియా కారెన్స్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ధరల పరంగా ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి రూ. 12.79 లక్షల మధ్య ఉంటుంది. ఎక్స్ఎల్6 ధరలు రూ. 11.41 లక్షల నుంచి రూ. 14.67 లక్షల వరకు ఉంది. కావున ఈ విభాగంలో కారెన్స్ ధర కొంత ఎక్కువగానే ఉంది, కానీ రానున్న కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంది. -
కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..
భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న కియా మోటార్స్ మరో నాలుగు కొత్త కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో సిఎన్జి, 5 సీటర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 2025 నాటికి ఎలక్ట్రిక్ SUV విడుదలచేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. కొత్త కియా సెల్టోస్: కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకువస్తున్న ఉత్పత్తులలో కియా సెల్టోస్ ఒకటి. ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. ఈ మోడల్ సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. కావున ఈ ఏడాది చివరినాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కియా సోనెట్ సిఎన్జి: ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ సిఎన్జి రూపంలో విడుదలవుతుందని కంపెనీ తెలిపింది. సిఎన్జి వాహనాల వినియోగం పెరుతున్న తరుణంలో సోనెట్ సిఎన్జి విడుదలకు సిద్ధమవుతోంది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనుంది, దీని ధర పెట్రోల్ వెర్షన్ కంటే రూ. 1 లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ) కియా కారెన్స్ 5 సీటర్: సెవెన్ సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్న కియా కారెన్స్ త్వరలో 5 సీటర్ రూపంలో విడుదలకానుంది. ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌లో లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఫైవ్ సీటర్ కేవలం బేస్ వేరియంట్లకు మాత్రమే సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. న్యూ జనరేషన్ కార్నివాల్: 2023 కియా కార్నివాల్ 2023 ప్రారంభమలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో దర్శనమిచ్చింది. ఈ MPV ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న కార్నివాల్ కంటే 2023 మోడల్ కొంత పెద్దదిగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
Kia Niro: మగువల మనసు దోచిన కారు.. ఇదే!
2023 ఉమెన్స్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 'కియా నిరో' (Kia Niro) సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 43 దేశాల నుండి 63 మంది మహిళా మోటరింగ్ జర్నలిస్టులు ఈ కారుకి ఓటు వేశారు. మొత్తం 59 వాహనాలను పరిశీలించిన తరువాత కేవలం ఆరు వాహనాలు మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నాయి. కియా నిరో - బెస్ట్ అర్బన్ కారు జీప్ అవెంజర్ - బెస్ట్ ఫ్యామిలీ ఎస్యువి సిట్రోయెన్ సి5ఎక్స్ - బెస్ట్ లార్జ్ కారు నిస్సాన్ ఎక్స్ ట్రైల్ - బెస్ట్ లార్జ్ ఎస్యువి ఆడి ఆర్ఎస్3 - బెస్ట్ పర్ఫామెన్స్ కారు ఫోర్డ్ రేంజర్ - బెస్ట్ 4×4 ఫైనల్‌కు చేరుకున్న ఆరు కార్లలో కియా నిరో ఒక ప్రాక్టికల్ లిటిల్ సిటీ కారు అని, ఇది మీకు కావలసినన్ని సరసమైన ప్యాకేజీలో లభిస్తుందని ఆటోకార్ ఇండియాకు చెందిన రేణుకా కిరిపలాని అన్నారు. ఈ కారు 2021 సియోల్ మోటార్ షోలో గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఇది టూ-టోన్ పెయింట్, బ్లాక్-అవుట్ వీల్ ఆర్చ్‌లు వంటి ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. (ఇదీ చదవండి: ఈవీల తయారీకి భారత్ చైనావైపు చూడాల్సిందేనా? జిటిఆర్ఐ రిపోర్ట్ ఏం చెబుతోందంటే!) కియా నీరో హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో లభిస్తుంది. EV పవర్‌ట్రెయిన్‌తో ఇది ఒక ఛార్జ్‌తో 463 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది, అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ 65 కిమీ పరిధిని అందిస్తుంది. సేఫ్టీ, డ్రైవింగ్, కంపర్టబుల్, టెక్నాలజీ, కెపాసిటీ వంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని విజేతలుగా ప్రకటించడం జరిగింది. విజేతలుగా నిలిచిన అన్ని కార్లు 2022వ సంవత్సరంలో విడుదలయ్యాయి. ఓటింగ్‌ను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లోని దాని కార్యాలయం నుండి గ్రాంట్ థోర్న్టన్ ధృవీకరించారు. -
Kia EV9: ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ రేంజ్, లాంచ్ ఎప్పుడంటే?
సౌత్ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ త్వరలో తన ఆధునిక ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈవీ9'ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా సమాచారం కొన్ని టీజర్ వీడియోల ద్వారా వెల్లడైంది. నిజానికి ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ గతేడాది జరిగిన 2022 ఆటో ఎక్స్పో వేదిక మీద కనిపించింది. కంపెనీ ఈ కారుని అభివృద్ధి చేయడానికి 44 నెలల సమయం పట్టిందని వెల్లడించింది. మొదటి సారి 2021 లాస్ ఏంజెల్స్ మోటార్ షో కనిపించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉత్పత్తికి నోచుకోలేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా మోటార్స్, ఈ కొత్త మోడల్ విడుదలతో మరిన్ని అద్భుతమైన అమ్మకాలు పొందే అవకాశం ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆటో ఎక్స్‌పోలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే మార్కెట్లో విడుదలవుతుంది. కియా ఈవీ9 మస్క్యులర్ క్లామ్‌షెల్ బానెట్, టైగర్ నోస్ గ్రిల్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, వైడ్ ఎయిర్ డ్యామ్, ఓఆర్వీఎమ్ స్థానంలో కెమెరాలు, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో వర్టికల్లీ స్టేక్డ్ టెయిల్‌ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి చూడవచ్చు. ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, డాష్‌బోర్డ్ చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, యోక్ స్టైల్ స్టీరింగ్ వీల్, పనారోమిక్ సన్ రూఫ్, మల్టీ కలర్ యాంబియెంట్ లైటింగ్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు పెద్ద స్క్రీన్స్ వంటివి ఇందులో అమర్చబడి ఉంటాయి. కియా ఈవీ9 ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 450కిమీ రేంజ్ అందిస్తుంది సమాచారం, అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలలో విడుదలవుతుంది. భారతీయ మార్కెట్లో 2024-2025 మధ్యలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
కియా మోటార్స్ ఈ కార్లను నిలిపివేస్తుందా?
భారతదేశంలో రోజురోజుకి ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. కియా మోటార్స్ కూడా దేశీయ మార్కెట్లో కియా ఈవి6 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ తరుణంలో కంపెనీ తన డీజిల్ మాన్యువల్ వేరియంట్లను నిలివేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటికే చాలా కంపెనీలు మార్కెట్లో డీజిల్ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసి ఆ స్థానంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఈ మార్గంలోనే కియా మోటార్స్ కూడా పయనించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ఔత్సాహికులు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సంతృప్తి చెందాలి, ఇది ఆటోమేటెడ్ క్లచ్ ఆపరేషన్‌తో కూడిన మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు సెల్టోస్ మాత్రమే 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లతో పాటు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ iMT ఆప్సన్ అందిస్తోంది. అయితే సొనెట్, కారెన్స్ డీజిల్ వేరియంట్స్ స్టాండర్డ్ మ్యాన్యువల్ & ఆటోమాటిక్లో లభిస్తున్నాయి. డీజిల్ వేరియంట్స్‌లో ఐఎమ్టికి అనుకూలంగా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను నిలిపివేసే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమాటిక్ మధ్య బ్యాలెన్స్‌ని స్ట్రైక్ చేయడం ద్వారా డ్రైవర్‌ను క్లచింగ్ అండ్ డీ-క్లచింగ్ను ఆటోమేటిక్‌గా చూసుకుంటూ షిఫ్టింగ్ పార్ట్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. గేర్ లివర్ ఉపయోగించి రెండు పెడల్ డ్రైవింగ్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో అనుకున్నంత సులభంగా ఉండదు. ఇటీవల చాలా మంది కస్టమర్లు క్లచ్‌లెస్ డ్రైవింగ్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికోసం కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం బిఎస్6 ఉద్గార ప్రమాణాలు మరింత కఠినతరం అవుతున్నాయి, ఈ సమయంలో డీజిల్ కార్ల ధరలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ ఈ కార్ల డిస్కంటీన్యూ గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందివ్వలేదు. -
టిక్‌టాక్ వీడియో దెబ్బ.. హ్యుందాయ్, కియా అబ్బా!
వాహన తయారీ సంస్థలు మునుపటి కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్‌తో వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే వాహనాలను దొంగలించేవారు అంతకు మించిన టిప్స్ ఉపయోగించిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక టిక్‌టాక్ వీడియో హ్యుందాయ్, కియా కంపెనీల పాలిట శాపంగా మారింది. ఆ వీడియోలో కార్లను ఎలా దొంగలించాలనేది వివరించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ వీడియో ప్రభావంతో అమెరికాలోని కొన్ని నగరాల్లో వాహన దొంగతనాలు 30 శాతం పెరిగాయి. ఈ వీడియోలో కేవలం ఒక USB కేబుల్‌తో కారు ఇంజిన్‌ను ఎలా స్టార్ట్ చేయాలో వివరించారు. ఇంటి బయట, రోడ్డు పక్కన పార్క్ చేసిన వందలాది కార్లను ఈ వీడియో సాయంతో దొంగలు అదృశ్యం చేశారు. దీంతో రెండు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. హ్యుందాయ్, కియా కంపెనీలు 2015 నుంచి 2019 మధ్య అమెరికాలో తయారైన 83 లక్షల కార్ల సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి సంకల్పించాయి. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2015 - 2019 మధ్య తయారు చేయబడిన కార్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ లేదు. దొంగలు అలాంటి కార్లను సులభంగా దొంగలిస్తున్నారు. దొంగతనాలను నివారించాడనికి తమ వాహనాలలో సెక్యూరిటీ ఏజెన్సీల సహాయంతో కంపెనీలు వీల్ లాక్, స్టీరింగ్-వీల్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉచితంగా అందించనున్నారు. అన్ని కార్లను అప్డేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే 12 అమెరికన్ రాష్ట్రాలలో 26,000కి పైగా భద్రతా పరికరాలను అందించాయి. 2021 నుంచి తయారైన దాదాపు అన్ని కార్లు ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్‌తో వస్తున్నాయి. -
కియా ఇండియా కీలక ప్రకటన.. ఇకపై సెల్టోస్ కార్లలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా అన్ని సెల్టోస్ కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రమాణికంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.కంపెనీ ఇప్పటికే కరెన్స్ మోడల్లో అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా ఆఫర్ చేస్తోంది. భారత్‌లో సంస్థ మొత్తం అమ్మకాల్లో సెల్టోస్ వాటా ఏకంగా 60 శాతం దాకా ఉంది.ఎనమిది మంది కూర్చునే వీలున్న వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2022 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. -
వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..?
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. కియా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కియా ఈవీ6(Kia EV6) ఎలక్ట్రిక్ కారును భారత్ మార్కెట్లలో అరంగేట్రం చేసేందుకు కంపెనీ ప్రణాళికలను రచిస్తోంది. బుకింగ్స్ ప్రారంభం..! భారత మార్కెట్లలోకి కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కొద్ది రోజుల్లోనే లాంచ్ చేసేందుకు కియా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఆల్-ఎలక్ట్రిక్ కియా EV6 బుకింగ్స్‌ను మే 26న మొదలుపెట్టనున్నట్లు సమాచారం. కాగా భారత్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కియా ఈవీ6 కారును మే 2021లో కియా మోటార్స్ ఆవిష్కరించింది. సూపర్ ఫీచర్స్‌తో..! కియా ఈవీ6 అద్బుతమైన ఫీచర్స్‌తో రానుంది. ఈ కారు సీక్వెన్షియల్ డైనమిక్ లైట్ ప్యాటర్న్‌తో సొగసైన డీఆర్ఎల్స్తో వస్తోంది. కారు సైడ్ ప్రొఫైల్ ఆధునిక, సొగసైన, ఏరోడైనమిక్ డిజైన్‌తో ఈ కారుకు ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. మొత్తంమీద ఈ కారు ఏరోడైనమిక్ స్టైలింగ్ అంశాలను రానుంది. Kia EV6 రియర్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే..! అంతర్జాతీయ మార్కెట్లో కియా ఈవీ6 వాహనం 58kWh, 77.4kWh బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. వీటి సహాయంతో డ్రైవింగ్ పరిధి మెరుగవ్వనుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 510 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఇక AWD వెర్షన్లో గరిష్టంగా 605 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కియా ఈవీ6 కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ధర సుమారు రూ. 1 కోటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: స్కోడా కీలక నిర్ణయం..సెకండ్ హ్యండ్ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..! -
కియా ఇండియా షాకింగ్ నిర్ణయం..!
Kia Car Price Hike: భారత ఆటోమొబైల్ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా కియామోటార్స్ నిలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ఆనతి కాలంలో భారీగా ఆదరణను పొందింది కియా మోటార్స్. కాగా తాజాగా కొనుగోలు దారులకు షాక్ ఇస్తూ కార్ల ధరలను పెంచుతూ కియా ఇండియా నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కియా ఇండియా కూడా పలు కార్ల ధరలను పెంచింది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తోందని కియా ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. భారత మార్కెట్లలోకి సెల్టోస్, సోనెట్, కార్నివాల్, కారెన్స్ వంటి కార్లను కియా ఇండియా ప్రవేశపెట్టింది. ధరల పెంపుతో కియా కారెన్స్, కియా సెల్టోస్, సోనెట్, కార్నివాల్ ధరలు భారీగా పెరగనున్నాయి. సవరించిన ధరలు ఇలా ఉన్నాయి..! భారత మార్కెట్లలోకి కియా కారెన్స్ ఎంపీవీ వాహనాన్ని కియా ఇండియా లాంచ్ చేసింది. కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తోంది. వీటిపై రూ.70,000 వరకు ధరలను కియా ఇండియా పెంచింది. ఆయా ట్రిమ్స్ మోడల్స్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌తో కూడిన ప్రీమియం 7-సీటర్ కియా కారెన్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌తో కూడిన లగ్జరీ+ 7-సీటర్ ధర వరుసగా రూ. 40,000, రూ. 70,000 వరకు పెరిగింది. కియా సెల్టోస్ ధరలు కూడా రూ. 10,000 నుంచి రూ. 36,000 వరకు పెరిగాయి. కియా సెల్టోస్ GTX+ 1.4 మాన్యువల్ ధర రూ. 10,000 పెరిగింది. సెల్టోస్ HTX+ 1.5 మాన్యువల్, iMT ట్రిమ్స్ ధరలు రూ. 36,000 మేర పెరిగాయి. కియా సెల్టోస్ డీజిల్ మోడల్స్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 34,000 వరకు పెరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కియా సోనెట్ పెట్రోల్, డీజిల్ మోడళ్ల ధరలలో రూ.10,000 నుంచి రూ.30,000 వరకు పెరిగాయి. పెట్రోల్ సోనెట్ హెచ్టిఎక్స్ 1.0 మోడల్ ధర గణనీయంగా రూ. 30,000 వరకు పెరిగింది. కియా సోనెట్ HTX 1.5 డీజిల్ వెర్షన్ ఇప్పుడు GTX 1.5 మాన్యువల్ వెర్షన్ కంటే రూ. 30,000 ఖరీదైనది. కియా కార్నివాల్ ధరలను రూ. 50,000 పెంచుతూ కియా ఇండియా నిర్ణయం తీసుకుంది. 6 సీట్ల ప్రిస్టీజ్ ఆటోమేటిక్ ధర రూ.29.49 లక్షలుగా ఉండగా.... ఇప్పుడు ఈ కారు రూ.29.99 లక్షలకు లభించనుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..?