ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తాజాగా తన ‘సెల్టోస్ మిడ్–సైజ్ ఎస్‌యూవీ’ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో ఇటీవలే తొలి కారును ఆవిష్కరించిన కంపెనీ.. గురువారం దేశవ్యాప్తంగా విడుదలచేసింది. ఈకారు ధరల శ్రేణి రూ.9.69 లక్షలు నుంచి రూ.15.99 లక్షలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32,035 బుకింగ్స్ పూర్తయినట్లు సంస్థ ఎండీ, సీఈఓ కూక్ హున్ షిమ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్లాంట్‌లో 5,000 యూనిట్ల ఉత్పత్తి పూర్తికాగా.. ఇవి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన కస్టమర్లకు 45– 60 రోజుల సమయం పడుతుంది. ఇక అనంతపురం ప్లాంట్ నుంచే త్వరలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతికానున్నట్లు చెప్పారాయన. ఆటోరంగ పరిశ్రమపై మాట్లాడిన ఆయన.. ఈ రంగం ఇబ్బందుల్లో పడడం, మళ్లీ పుంజుకోవడం వంటి తాత్కాలిక ఒడిదుడుకులు ఉంటాయని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment