సాక్షి, అమరావతి: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా చేసిన ప్రచారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి అవాస్తవాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ రాష్ట్రంలోనే ఉంటుందని ఆ సంస్థ ఎండీ స్పష్టం చేసిన విషయాన్ని ట్విటర్ వేదికగా జయదేవ్‌కు గుర్తుచేశారు. టీడీపీ లోక్‌సభా వేదికగా చేసిన దుష్ప్రచారానికి ఇదే సమాధానం అంటూ కియా ఎండీ చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తా కథనాన్ని జోడించారు. (కియాపై ఎండీ కీలక ప్రకటన.. ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లు)
ఈ మేరకు... ‘‘నీ తలపై జుట్టు మాత్రమే లేదనుకున్నాను. కానీ బుర్ర కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏపీలో ఉన్న పెట్టుబడిదారులను తరిమేయాలని ఎందుకంత తొందర మీకు? ఎవరు బాధ్యతరాహిత్యంతో ప్రవర్తిస్తున్నారో ఇప్పటికైనా అర్థమైందా. కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోవడం లేదని ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. ఒక ఎంపీగా ఉండి అసత్యాలు ప్రచారం చేస్తావా? అయినా నీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం’’ అని మిథున్‌రెడ్డి ట్వీట్ చేశారు. లోక్‌సభలో తన ప్రసంగాన్ని విమర్శిస్తూ జయదేవ్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా మిథున్‌రెడ్డి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. కాగా కియా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోవడం లేదంటూ మిథున్‌రెడ్డి గురువారం లోక్‌సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే పేరుతో ఓ డమ్మీ కంపెనీ సృష్టించి రూ. 30 కోట్ల పెట్టుబడికి.. రూ. వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చింది. దీని గురించి ప్రశ్నిస్తే.. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తోంది’’ అని ఆయన విమర్శించారు.(దురుద్దేశంతోనే దుష్ప్రచారం)
ఉదయమే కియా ఎండీతో మాట్లాడా: మిథున్‌రెడ్డి
"You had asked for this. Here's the answer. KIA motors has clarified that they are not moving out of AP. Mr. @JayGalla why are you spreading fake news? Don't you know that an MP should be responsible? Or is it too much to expect from you?"https://t.co/OHckEoU0Kq
— Mithunreddy (@MithunReddyYSRC) February 7, 2020
Comments
Please login to add a commentAdd a comment