న్యూఢిల్లీ: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించింది. అందుకుగాను మొదటి ఎలక్ట్రిక్ కారు ఈవి-6 మోడల్ టీజర్‌ను మంగళవారం కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారును ప్రపంచవ్యాప్తంగా మార్చి 15న ఆవిష్కరించబోతుంది. వినియోగదారులకు దీర్ఘకాలిక పరిష్కారాలను అందించడంలో భాగంగా కియా మోటర్స్ ‘ప్లాన్-ఎస్’ ప్రణాళికను జనవరిలోనే తెలిపిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా 2027 లోపు ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ ఉత్పత్తి చేయనుంది. కంపెనీ నుంచి ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిక్ వాహన శ్రేణుల్లో ‘ఈవి’తో మొదలుకానున్నాయి. దాంతో పాటు కియా లోగో కూడా మారబోతుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తున్న భారీ ఆదరణ నేపథ్యంలో కియా ఈ కొత్త ఇ-వాహనాన్ని తీసుకు రానుండటం విశేషం.
The Kia EV6. Bold, original and innovative.
Get ready to be inspired.
Focus. The full design of the Kia EV6 will be unveiled on 15 Mar.#Kia #EV6 #MovementThatInspires #KiaEV6 pic.twitter.com/evB4TDYAly
— Kia Worldwide (@Kia_Worldwide) March 8, 2021
Comments
Please login to add a commentAdd a comment