
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కియా మోటర్స్ తమిళనాడుకు తరలిపోతుందని చంద్రబాబు చేసిన అసత్య ప్రచారాలపై విజయసాయి రెడ్డి ఆసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు. అన్నింటికీ తెగబడి పోయాడు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు.’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.(ఎగుమతుల సబ్సిడీలకు డబ్య్లూటీవో ఆటంకాలు)
మరో ట్వీట్‌లో ‘బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోంది. నదులన్నీ వెనక్కి ప్రవహిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోంది. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది లాంటి వార్తలు వస్తాయి త్వరలో. చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్!’ అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘ఇంకా ఏమేం ఉన్నాయో చెప్పండి విజనరీ’)