సాక్షి, తాడేడేల్లి: కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందిసతూ.. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని "కులమీడియా" లో లీకులు ఇస్తూ కార్మికులను గందరగోళంలోకి నెడ్తున్నారని మండిపడ్డారు. 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం చూస్తే చంద్రబాబు కల్లబొల్లి మాయోపాయాలు అర్థమవుతాయని అన్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకుండా ఉక్కు ఫ్యాక్టరీ నడవదని, దాన్నో సాకుగా చూపి అమ్మకానికి పెట్టాలన్నది చంద్రబాబు క్షుద్ర ప్రణాళికగా పేర్కొన్నారు.
కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవు. ఉమ్మడి ఆంధ్ర సిఎంగా 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని "కులమీడియా" లో లీకులు ఇస్తూ కార్మికులను…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 28, 2024
Comments
Please login to add a commentAdd a comment