
అమరావతి: పచ్చమీడియాపై ట్విటర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) డిజైన్లలో పనుల అంచనాలను గుట్టు చప్పుడు కాకుండా 1,750 కోట్ల మేరకు పెంచాలని అను‘కుల మీడియా గొల్లుమని శోకాలు పెట్టిందని రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
కాగా, కేంద్ర జల సంఘం డిజైన్లలో అదనపు పనులు చేర్చడంతోపాటు, కేంద్రం అనుమతితోనే ఈ స్వల్ప పెంపు జరిగిందని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదని పచ్చమీడియాను ఉద్దేషించి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు, పచ్చమీడియాలు దిగజారీ రాజకీయాలు చేస్తోందని ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment