
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో పరాజయం పాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదని దుయ్యబట్టారు. ఎందుకు ఓడానో తెలియదని..తనను అర్థం చేసుకునే శక్తి లేకే ఓడించారని ప్రజలను నిందిస్తున్నాడని మండిపడ్డారు. ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే ఫెయిల్ చేశారని విద్యార్థి ఏడ్చినట్లు ఉంది బాబు వ్యవహారమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చదవండి: ‘ఆ వాయిస్ పెద్ద పచ్చ ఫంగస్‌దే.. ఈడీ కూడా తేల్చేసింది’
పరాజయంపాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదు. ఎందుకు ఓడానో తెలియదని, తనను అర్థం చేసుకొనే శక్తిలేకే ఓడించారని ప్రజలను నిందిస్తున్నాడు. ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే తనను ఫెయిల్ చేశాడని విద్యార్థి ఏడ్చినట్టుంది బాబు వ్యవహారం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 1, 2021