భారతీయ విఫణిలో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. తన ఈవీ6 కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్లకు ఎందుకు రీకాల్ ప్రకటించింది? ఎన్ని కార్లపై ఈ ప్రభావం చూపుతుంది అనే విషయాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..
కియా ఈవీ6 కార్లలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో ఏర్పడిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇది 1138 యూనిట్లపై ప్రభావం చూపుతుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి కంపెనీ స్వచ్చందంగానే రీకాల్ ప్రకటించింది. ఐసీసీయూ లోపం 12 వోల్ట్స్ బ్యాటరీ పనితీరు మీద ప్రభావం చూపుతుంది.
2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన కియా ఈవీ6 కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. లోపాన్ని సరిచేయడానికి కంపెనీ కారులోని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తుంది. దీనికోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన పని లేదు. కంపెనీ త్వరలోనే కస్టమర్లకు ఈ సందేశాన్ని పంపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment