recalled
-
కొరియన్ బ్రాండ్ కీలక నిర్ణయం.. ఇండియాలో 1138 కార్లు వెనక్కి
భారతీయ విఫణిలో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. తన ఈవీ6 కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్లకు ఎందుకు రీకాల్ ప్రకటించింది? ఎన్ని కార్లపై ఈ ప్రభావం చూపుతుంది అనే విషయాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..కియా ఈవీ6 కార్లలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో ఏర్పడిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇది 1138 యూనిట్లపై ప్రభావం చూపుతుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి కంపెనీ స్వచ్చందంగానే రీకాల్ ప్రకటించింది. ఐసీసీయూ లోపం 12 వోల్ట్స్ బ్యాటరీ పనితీరు మీద ప్రభావం చూపుతుంది.2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన కియా ఈవీ6 కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. లోపాన్ని సరిచేయడానికి కంపెనీ కారులోని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది. దీనికోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన పని లేదు. కంపెనీ త్వరలోనే కస్టమర్లకు ఈ సందేశాన్ని పంపిస్తుంది. -
ముంబై దాడులను ఎన్నటికీ మర్చిపోలేం : మన్ కీ బాత్‌లో ప్రధాని
న్యూఢిల్లీ: ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడులను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అది ఒక దారుణమైన ఉగ్ర దాడి అని అభివర్ణించారు. ఆదివారం తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని ముంబై టెర్రర్ దాడులను ప్రస్తావించారు. ‘ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడులను ఎప్పటికీ మర్చిపోలేం.ఆ రోజున ఉగ్రవాదులు ముంబైతో పాటు మొత్తం దేశాన్నే వణికించారు. ఆ దాడుల నుంచి మనం ధైర్యంతో కోలుకుని ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్లో 26/11 దాడుల్లో మరణించిన అమరవీరులకు నివాళులర్పించారు.వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ అండగా నిలుస్తుందన్నారు. దాడుల్లో మరణించిన పోలీసుల ధైర్య సాహసాలు ఉగ్రవాదంపై పోరులో దేశ పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరం ద్వారా దేశంలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు 2008, నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్‌తో పాటు పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పలు జరపడంతో పాటు గ్రెనేడ్లు విసిరారు. ఈ ఉగ్ర దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బందితో పాటు మొత్తం 166 మంది చనిపోయారు.10 మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భద్రతా బలగాలు అప్పటికప్పుడే మట్టుబెట్టాయి. ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదికి మరణశిక్ష పడింది. ఇదీచవండి..సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి -
71 వేల కియా కార్ల రీకాల్.. ఎందుకో తెలుసా?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా తన సంస్థకు చెందిన 71వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కేంద్రంగా కియా కార్లలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కార్లలో లోపాల్ని పరిశీలిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా 2008 -2009కి చెందిన 71వేల స్పోర్టేజ్ కార్లను రీకాల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కారులో ఉన్న యాంటీ లాక్ బ్రేక్ సిస్టం (ఏబీఎస్)లోని హైడ్రాలిక్ కంట్రోల్ యూనిట్‌లోని లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కార్లలోని లోపాల్ని సరి చేసేందుకు సిద్ధమైనట్లు కియా వెల్లడించింది. 2017 నుంచి కియా 2017 నుంచి తన 8 స్పోర్టేజ్ స్పోర్ట్ యుటిలిటి వెహికల్స్ (ఎస్యూవీ)లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం, 15 రకాల మెల్టింగ్, డ్యామేజ్లాంటి ప్రమాదాలు గుర్తించింది. 2016 నుంచి ఆ వెహికల్స్‌లోని లోపాల్ని సరిచేయడం ప్రారంభించింది. దూరంగా పార్కింగ్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) తో కియా దాఖలు చేసిన ప్రకారం , రీకాల్ పూర్తయ్యే వరకు యజమానులు నిర్మాణాలు లేదా ఇతర వాహనాలకు వెలుపల, దూరంగా పార్క్ చేయాలని కియా,ఎన్హెచ్టీఎస్ఏ సమావేశంలో ఈ సమస్యల పరిష్కార మార్గంగా చర్చించాయి. -
ఎయిర్బాగ్స్ సమస్య: కియా కార్ల భారీ రీకాల్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల కంపెనీ కియా తన పాపులర్ మోడల్ కియా కేరెన్స్ కార్లను భారీగా రీకాల్ చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా దాదాపు 44,174 ఎంపీవీ యూనిట్లు రీకాల్ చేసింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను పరిశీలించనుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్న కియా కేరెన్స్ కార్ల స్వచ్ఛంద రీకాల్‌లో అవసరమైతే సాఫ్ట్వేర్ అప్డేట్తో ఎయిర్‌బ్యాగ్ సమస్యను కంపెనీ పరిష్కరించ నుంది. ఇందులో భాగంగా ప్రభావితమైన కారు యజమానులను నేరుగా సంప్రదిస్తుంది. లేదంటే సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కియా కేరెన్స్ యజమానులు తమ కారును సమీపంలోని కియా డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా కియా ఇండియా వెబ్సైట్, యాప్ లేదా వారి కాల్ సెంటర్లో గానీ సంప్రదించవచ్చు. (Akasa Air ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!) కాగా గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో కియా కేరెన్స్ 3-స్టార్ ర్యాంక్ సాధించింది.1.5 పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మూడు వేరియంట్లలో ఇది లభ్యం. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 8-స్పీకర్లు, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే 5 ట్రిమ్‌లలో ఇది లభ్యం. అన్నింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, 10 హై-సేఫ్టీ ప్యాకేజీలు కూడా అందింస్తున్న సంగతి తెలిసిందే. (జావా అదిరిపోయే కొత్త బైక్ చూశారా? ధర కూడా అంతే అదుర్స్) -
మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్లను మరోసారి రీకాల్ చేసింది. ఏడబ్యుడీ వేరియంట్లలో ఈసారి రీకాల్ ప్రధాన భాగం భర్తీ కోసంవాహనాలను వెనక్కి తీసుకుంటోంది. నెలరోజుల్లోలనే వాహనాలను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ప్రొపెల్లర్ షాఫ్ట్ సమస్య కారణంగా మహీంద్ర ఎక్స్ యూవీ 700 కార్లను ఇటీవల రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. రియర్ వీల్ కాయిల్ స్ప్రింగ్‌ల ప్రస్తుత ప్లేస్మెంట్లో ఉన్న సమస్యల కారణంగా మహీంద్ర ఈ రీకాల్ చేసినట్లు తెలుస్తోంది. XUV700 AWDలోని వెనుక చక్రాల కాయిల్ స్ప్రింగ్‌లు ప్రతి స్ప్రింగ్‌లో 9 రౌండ్ కాయిల్స్ ఉండేలా మార్పులు చేసింది. అయితే 9 కి బదులుగా 8 రౌండ్ కాయిల్స్ ఉంటే, ఆ కార్లను కొత్త స్ప్రింగ్‌లతో భర్తీ చేసేందుకు సమీపంలోని సర్వీస్ సెంటర్లో సంప్రదించాలని మహీంద్ర కోరినట్టు తెలుస్తోంది. అయితే ప్రభావిత వాహనాల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. కాగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 2021లో లాంచ్ అయిన పాపులన్ మోడల్. కొన్ని వేరియంట్ల నిరీక్షణ సమయం ఒక సంవత్సరం అంటే దీన్ని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 70వేల ఎక్స్‌యూవీ700 కార్ల డెలివరీలు పెండింగ్‌లో ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజుకర్ ఇటీవల వెల్లడించారు. 5 సీట్లు , 7 సీట్ల ఎంపికలతో లభిస్తున్న ఈ కారు ధర 13.18 లక్షలు,(ఎక్స్-షోరూమ్) ప్రారంభం. ఇది కూడా చదవండి: ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
ఆ స్కూటర్లు వెనక్కి తీసుకుంటాం
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినావా సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో అప్రమత్తమైంది. తమ కంపెనికి చెందిన స్కూటర్లను రీకాల్ చేస్తామంటూ ప్రకటించింది. 2022 మార్చి 26న తమిళనాడులో ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఒకినావా స్కూటు తగలబడి పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సచలనంగా మారింది. మరో రెండు రోజులకే తమిళనాడులోని తిరుచ్చిలో మరో స్కూటర్లో బ్యాటరీ కాలిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన ఒకినావా ప్రైస్ ప్రో మోడళ్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఒకినావా రీకాల్ చేయాలని నిర్ణయించిన ఒకినావా ప్రైస్ ప్రో మోడల్ స్కూటర్లు దేశవ్యాప్తంగా 3,125 అమ్మడుడయ్యాయి. కొనుగోలుదారులు దేశవ్యాప్తంగా ఉన్న ఒకినావా షోరూమ్‌లకు వెళ్లి వీటిని వెనక్కి ఇచ్చేయవచ్చు. ఇలా తీసుకున్న స్కూటర్ల భద్రతను మరోసారి సంపూర్ణంగా పరిశీలించనుంది ఒకినావా. ఒకినావా స్కూటర్ కేంద్ర కార్యాలయం, తయారీ యూనిట్ హర్యాణాలో ఉంది. ఇప్పటి వరకే దేశవ్యాప్తంగా ఒకినావాకి సంబంధించి మొత్తం 25,000 స్కూటర్లు, బైకులు అమ్ముడయ్యాయి. ఇందులో హై స్పీడ్ వెహికల్ విభాగంలో అక్కడక్కడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అందులో బ్యాటరీ పనితీరు, రక్షణ వ్యవస్థలను చెక్ చేయాలని ఒకినావా నిర్ణయించింది. చదవండి: ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..! -
బీఎండబ్ల్యూకి భారీ షాక్..వెంటనే డ్రైవింగ్ ఆపేయండి,షెడ్డుకు లక్షల కార్లు!
ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకి భారీ షాక్ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా బీఎండబ్ల్యూ వెహికల్స్‌లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వరల్డ్ వైడ్‌గా 1.03 మిలియన్ వెహికల్స్‌ను రీకాల్ చేస్తున్నట్లు బీఎండబ్ల్యూ అధికారికంగా తెలిపింది. 2017నుంచి బీఎండబ్ల్యూ ఇప్పటి వరకు రెండు సార్లు తమ కార్లను రీకాల్ చేసింది. తాజాగా 2006 నుంచి 2013 మధ్య కాలంలో తయారు చేసిన కార్లతో పాటు 1సిరీస్, 3సిరీస్, ఎక్స్ 3, 5సిరీస్, ఎక్స్ 5, జెడ్ 4 మోడల్ కార్లు ఉన్నాయి. పాజిటివ్ క్రాంక్కేస్ వెంటిలేషన్ వాల్వ్ (పీసీవీ) కోసం హీటర్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరిగినా.. అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. డ్రైవింగ్ చేయడం ఆపండి కొత్తగా రీకాల్ చేసిన కార్లు ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్లో 917,106, కెనడాలో 98,000, దక్షిణ కొరియాలో 18,000 వాహనాలు ఉన్నాయని బీఎండబ్ల్యూ వెల్లడించింది. గతంలో 2017లో 740,000, 2019లో 184,000 వాహనాల్ని రీకాల్ చేయగా..తాజాగా భారీ ఎత్తున కార్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం తాము తయారు చేస్తున్న కొత్తకార్లకి, రీకాల్ చేసిన కార్లకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. తాజా రీకాల్‌కు సంబంధించి ఎలాంటి ప్రమాదాలు లేదా గాయాల గురించి తమకు తెలియదని, రీకాల్ పరిష్కారానికి సంబంధించి యజమానులు డ్రైవింగ్‌ను ఆపాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్న ప్రాంతం నుండి పొగ లేదా పొగ వాసన లేదా ప్లాస్టిక్ మండే వాసన కనిపించినట్లయితే వెంటనే డ్రైవింగ్ చేయడం ఆపేయాలని బీఎండబ్ల్యూ స్పష్టం చేసింది. చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..! -
మూడు కోట్ల ఖరీదైన కారు.. ఆ సమస్యతో రీకాల్
లగ్జరీ స్పోర్ట్స్ కార్ సెగ్మెంట్లో లంబోర్గిని స్ట్రేచరే వేరు. లుక్, డిజైన్, కెపాసిటీ ఇలా అన్ని విభాగాల్లో లోపాలకు తావే లేకుండా ఉంటుంది. అందుకే ఈ కాస్ట్లీ కారుకి ఇండియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఓ లోపం కారణంగా ఈ కారుని లంబోర్గిని రీకాల్ చేసింది. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ లంబోర్గిని బ్రాండ్‌తో కార్లను మార్కెట్లోకి తెస్తోంది. ఇందులో ప్రస్తుతం ఉరూస్ మోడల్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. ఈ కారు ఇండియాలో ఎక్స్ షోరూం ధర రూ. 3.10 కోట్లుగా ఉంది. బిజినెస్ మ్యాగ్నెట్లు, సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఈ మోడల్ కార్లను వినియోగిస్తున్నారు. ఇండియాలో లంబోర్గిని ఉరూస్ మోడల్ కార్లు 300ల వరకు ఉన్నాయి. అయితే ఇటీవల ఈ కార్లలో లోపాలను ఉన్నట్టుగా లంబోర్గిని దృష్టికి వచ్చింది. వెంటనే ఆయా కార్లను పరిశీలించింది. 2021 ఫిబ్రవరి 12 నుంచి 24 మధ్య తయారైన కార్లలో సీటు బెల్టుకి సంబంధించి ఆటోమేటిక్ లాకింగ్ రిట్రాక్టర్ (ఏఎల్ఆర్) ఫంక్షన్లో లోపాలు ఉన్నట్టుగా తేలింది. ఇలాంటి లోపాలు ఇండియాలో మూడు కార్లలో ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే లోపాలు ఉన్న కార్లను అక్టోబరు 1న వెనక్కి తీసుకోనుంది లంబోర్గిని. లంబోర్గిని కార్ల క్వాలిటీ విషయంలో ఫోక్స్‌వ్యాగన్ అస్సలు కాంప్రమైజ్ కాదు. ఈ ఘటన జరగడానికి ముందు 2020 డిసెంబరులో ప్రపంచ వ్యాప్తంగా స్వల్ప లోపాలు ఉన్న 80 ఉరూస్ కార్లను వెనక్కి తీసుకుంది. లంబోర్గిని ఉరుస్‌లో 4 లీటర్ ట్విన్ టర్బో వీ 8 ఇంజన్ అమర్చారు. ఈ కారు కేవలం 3.6 సెకన్ల వ్యవధిలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. లంబోర్గిని ఉరుస్ కార్లను 2018లో మార్కెట్లోకి తెచ్చారు. ఫస్ట్బ్యాచ్లో 1000 కార్లను తయారు చేయగా అందులో ఇండియాకి 25 కార్లను కేటాయించారు. చదవండి : Tesla Cars:'టెస్లా చెత్త కారు'..రివ్యూపై చర్యలకు సిద్ధమైన ఎలాన్ మస్క్ -
Tesla Electric Cars: టెస్లాకు భారీ దెబ్బ...!
బీజింగ్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోని సుమారు 2,85,000 ఎలక్ట్రిక్ కార్లను వెనక్కి పిలవనుంది. టెస్లా కార్లలోని అసిస్టెడ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయని పరిశోధనలో తేలింది. ఈ సాంకేతిక సమస్యతో రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. టెస్లా కార్లలో క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థ ఒక్కసారిగా ఆక్టివేట్ అయ్యి, ఒక్కసారిగా వేగం పెరిగే ప్రమాదం ఉన్నందున్న వాటిని సరిచేసేందుకే వెనక్కి పిలుస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ సమస్యను టెస్లా మోడల్ 3, మోడల్ వై కార్లలో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సంఖ్యలో కార్లను వెనక్కి పిలవడం కంపెనీకి భారీ దెబ్బ అని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా టెస్లా కార్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో చైనా పౌరులు సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలో టెస్లాను లక్ష్యంగా చేసుకొని ఫిర్యాదులను నమోదు చేస్తున్నారు. టెస్లా కార్లను కంపెనీకి తీసుకెళ్తే, క్రూయిజ్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని టెస్లా తెలిపింది. కాగా అంతకుముందు చైనా మిలటరీ వ్యవస్థ టెస్లాకు సంబంధించిన కార్లు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించనున్న ఎలన్ మస్క్..! -
1.6 మిలియన్ల హోండా కార్లు రీకాల్
వాషింగ్టన్: హోండా కంపెనీ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్ లోపాలకారణంగా అమెరికాలో 1.6 మిలియన్ వాహనాలను రీకాల్ చేస్తామని హోండా శుక్రవారం తెలిపింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించిన గడువుకు ఆరు నెలల ముందే ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లోపభూయిష్ట టకాటా ఎయిర్ బ్యాగ్‌లను రీప్లేస్ చేస్తామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ కార్లను, అమెరికాలో దాదాపు 12.9 మిలియన్ల హోండా, అకూరా ఆటోమొబైల్స్ కార్లను రీప్లేస్ చేశామని పేర్కొంది. కాగా 2013 నుండి తకాటా ఎయిర్బ్యాగ్లలోని లోపాలతో సంభవించిన ప్రమాదాల్లో సుమారు 20 మంది మరణించారు. దీంతో అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సీరియస్‌గా స్పందించింది. -
భారీ మొత్తంలో లెనోవో ల్యాప్‌టాప్‌లు రీకాల్
న్యూఢిల్లీ : పేలుళ్ల ఘటనలతో ఇన్నిరోజులు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజాగా ల్యాప్‌టాప్‌లు కూడా ఈ ఘటనల బారిన పడుతున్నాయి. పేలుళ్ల కారణాలతో చైనీస్ తయారీదారి లెనోవో భారీ మొత్తంలో ల్యాప్‌టాప్‌లను రీకాల్ చేసింది. థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్‌లను రీకాల్ చేసినట్టు లెనోవో ప్రకటించింది. 78వేల యూనిట్ల థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ ఐదో జనరేషన్ ల్యాప్‌టాప్‌లను కంపెనీ రీకాల్ చేసినట్టు అమెరికాలోని కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ కూడా వెల్లడించింది. ఓవర్‌హీట్‌తో బ్యాటరీలు పాడైపోతున్నాయని తెలిపింది. దీంతో పేలుళ్ల ఘటనలు సంభవిస్తున్నాయని, వెంటనే ఈ బ్యాటరీలను రీఫైర్ చేయాల్సి ఉందని చెప్పింది. మొత్తం 78వేల యూనిట్ల రీకాల్‌లో 55,500 యూనిట్ల రీకాల్ కెనడాలోనే జరిగింది. లెనోవో థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ ల్యాప్‌టాప్ ఐదవ జనరేషన్‌కు చెందింది. ఇది సిల్వర్, బ్లాక్ రంగుల్లో మార్కెట్లోకి వచ్చింది. రీకాల్ చేసిన ఈ 78వేల యూనిట్ల ల్యాప్‌టాప్‌లు 2016 డిసెంబర్ నుంచి 2017 డిసెంబర్ మధ్యలో తయారుచేశారు. థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ 5వ తరం యూజర్లు వెంటనే https://support.lenovo.com/X1C_5GEN_RECALL లింక్‌ను క్లిక్ చేసి, తమ ల్యాప్‌టాప్‌లు రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కంపెనీ సూచించింది. ఒకవేళ ఈ జాబితాలో యూజర్ల ల్యాప్‌టాప్ ఉంటే, వెంటనే దాన్ని వాడటం ఆపివేయాలని హెచ్చరించింది. ఇటీవలే ముంబైలో వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ లో ఉండగా పేలింది. ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆ కంపెనీ అధికారికంగా స్పందించలేదు. -
కార్లను రీకాల్ చేస్తున్న రెనాల్డ్, నిస్సాన్
-
షెవర్లే క్రూజ్ వెహికల్స్ భారీ రీకాల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ప్రీమియం సెడాన్ మోడల్ షెవర్లే క్రూజ్ (పెట్రోల్) 22 వేల వాహనాలను రీకాల్ చేయనుంది. ఇగ్నిషన్ సిస్టం లో లోపాల కారణంగా 2009-11 మధ్య ఉత్పత్తి అయిన ఈ మోడళ్లను వెనక్కి తీసుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈలోపంకారంగా వాహనం వేగం తగ్గుతోందని, ఈ లోపాన్ని సవరించే ఉద్దేశంతో వీటిని రీకాల్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఈ రీపేర్ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది. తక్కువ వాహనం వేగం, ఇగ్నిషన్ , ఇంజిన్ లోపాన్ని పరిష్కరించడానికి ఈ రీకాల్ చేపడుతుందని జనరల్ మోటార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తనిఖీకి లేదా మరమ్మతుకు ఒక్క కంటే ఎక్కువ పమయం పట్టదనీ తాము అంచనావేస్తున్నామని తెలిపింది. వినియోగదారులు సమీపంలో తమ డీలర్ ను సంప్రదించాలని కోరింది. వాహన భద్రతపై ఎలాంటి ప్రభావితం లేనప్పటికీ, ఇదొక స్వచ్ఛంద రీకాల్ అనీ, తమ వినియోగదారుల అనుభవాలను నిర్ధారించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జనరల్ మోటార్స్ భారతదేశం వైస్ ప్రెసిడెంట్ - మార్కస్ స్టెర్ బర్గ్ తెలిపారు. కాగా 2013లో దాదాపు 1.14 షెవర్లే తవేరా యూనిట్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే -
గుర్తుకొచ్చిన అనుబంధం
తాను నాటిన మొక్క పెరిగి పెద్దదై అన్నార్తులకు ఫలాలను అందజేస్తుంటే ఎవరికైనా తీయటి అనుభూతినిస్తుంది. ఆ కోవకు చెందినవారే ఎంవీపీసీ శాస్త్రి. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం తాను వికారాబాద్ మొట్టమొదటి సబ్ కలెక్టర్‌గా పని చేసిన కాలంలో ఆ గ్రామాన్ని సందర్శించారు. అమాయక చెంచుల దీనపరిస్థితిని చూసి చలించిపోయారు. అక్కడి ప్రజలను చైతన్యపర్చాలనే ఉద్దేశంతో గ్రామానికి ‘చైతన్యనగర్’గా నామకరణం చేశారు. సంక్షేమ ఫలాలను అభాగ్యుల చెంతకు చేర్చారు. అనంతరం ఆయన వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిపోయారు. ఇన్నేళ్ల తర్వాత శాస్త్రికి మళ్లీ ఆ గ్రామం మదిలో మెదిలింది. చెంచులతో అనుబంధం గుర్తుకొచ్చింది. ఆ దీనజనులు ఎలా ఉన్నారో చూడాలనుకున్నారు. ఆదివారం సతీసమేతంగా కారులో హైదరాబాద్ నుంచి పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్‌కు వచ్చారు. కాలనీవాసుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. నాటి తీపి గురుతులను నెమరువేసుకున్నారు. పెద్దేముల్: మండలంలోని రేగొండి పంచాయతీ అనుబంధ గ్రామమైన చైతన్య నగర్ (చెంచునగర్)ను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ మెంబర్ ఎంవీపీసీ శాస్త్రి ఆదివారం సందర్శించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత చైతన్యనగర్‌కు రావడం విశేషం. ఈ సందర్భంగాచైతన్యనగర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1979-81 ప్రాంతంలో శాస్త్రి వికారాబాద్ మొట్ట మొదటి సబ్ కలెక్టర్‌గా పని చేశారు. అప్పుడు రాష్ట్ర మంత్రిగా మాణిక్‌రావు ఉన్నారు. చైతన్యనగర్ను సందర్శించినప్పుడు చెంచులు పడుతున్న బాధలను చూసిన ఆయన మనసు చలించింది. వారి సంక్షేమానికి ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది ఆయనలో. వారి అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో చెంచునగర్గా ఉన్న గ్రామానికి ‘చైతన్య నగర్’గా పేరు పెట్టారు. చెంచుల అభివృద్ధికి కోట్‌పల్లి ప్రాజెక్టు కింద సుమారు 250 ఎకరాల భూమి ఇప్పించారు. ఇళ్లు, పాఠశాల, పాడి గేదెలను ఇప్పించేందుకు కృషి చేశారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించారు. అంతేకాకుండా చెంచుల యువతులకు వివాహాలు కూడా జరిపించారు. తాను పేరు పెట్టిన ఊరు ఎలా ఉందని 30 ఏళ్ల తర్వాత గుర్తు పెట్టుకొని హైదరాబాద్ నుంచి సతీసమేతంగా వచ్చారు. గ్రామంలోకి వచ్చిన శాస్త్రిని మొదటగా ఎవరూ గుర్తించలేదు. తర్వాత తాను శాస్త్రిని అని, అప్పట్లో మీకు ఇళ్లు, భూములు ఇప్పించానని, పెళ్లిళ్లు చేసింది తానేనని అని చెప్పడంతో అక్కడే ఉన్న వృద్ధులు, శాస్త్రి దొర బాగున్నావా అంటూ పాదాభివందనాలు చేశారు. గ్రామస్తులు పెద్ద మొత్తంలో పాఠశాల వద్ద గుమిగూడారు. బాగున్నారా అంటూ శాస్త్రి దంపతులను చెంచులు ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడున్నర దశాబ్దాల క్రితం చెంచునగర్గా ఉన్న ఈ గ్రామానికి తాను చైతన్యనగర్గా నామకరణం చేశానని గుర్తు చేసుకున్నారు. గ్రామం ప్రస్తుతం ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఉందో తెలుసుకేనేందుకు వచ్చానని తెలిపారు. పిల్లలను మంచిగా చదివించాలని చెంచులకు సూచించారు. అనంతరం డీలర్ లాలు శాస్త్రి దంపతులకు తేనె సీసాను అందజేశారు. అనంతరం ఆయనస్థానిక పాఠశాల ఆవరణలో చెంచులతో కలిసి భోజనం చేశారు. రాత్రి బడిలో పురుషులు చదువుకోవాలని చెప్పారు. ఆయనను కలిసిన వారిలో మాజీ సర్పంచ్‌లు అంజిలయ్య, ప్రకాశం, గ్రామస్తులు తిరుమలయ్య తదితరులున్నారు.