
బీజింగ్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోని సుమారు 2,85,000 ఎలక్ట్రిక్ కార్లను వెనక్కి పిలవనుంది. టెస్లా కార్లలోని అసిస్టెడ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయని పరిశోధనలో తేలింది. ఈ సాంకేతిక సమస్యతో రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. టెస్లా కార్లలో క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థ ఒక్కసారిగా ఆక్టివేట్ అయ్యి, ఒక్కసారిగా వేగం పెరిగే ప్రమాదం ఉన్నందున్న వాటిని సరిచేసేందుకే వెనక్కి పిలుస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం ఈ సమస్యను టెస్లా మోడల్ 3, మోడల్ వై కార్లలో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సంఖ్యలో కార్లను వెనక్కి పిలవడం కంపెనీకి భారీ దెబ్బ అని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా టెస్లా కార్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో చైనా పౌరులు సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలో టెస్లాను లక్ష్యంగా చేసుకొని ఫిర్యాదులను నమోదు చేస్తున్నారు. టెస్లా కార్లను కంపెనీకి తీసుకెళ్తే, క్రూయిజ్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని టెస్లా తెలిపింది. కాగా అంతకుముందు చైనా మిలటరీ వ్యవస్థ టెస్లాకు సంబంధించిన కార్లు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment