ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk)కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మస్క్ చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది.
ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా గత కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల సేల్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. చైనా ప్రధాన పోటీదారుగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. టెస్లా స్టాక్ భారీగా తగ్గడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.
టెస్లా అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు
ఎలక్ట్రిక్ వాహన రంగంలో చైనా తమకు పోటీ వస్తోందని ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ మార్కెట్ మీద నియంత్రణ కోల్పోతే చైనా తప్పకుండా ఇతర దేశాల వ్యాపారాలను కొల్లగొట్టే ప్రమాదం ఉందని వాపోయారు. ప్రస్తుతం BYD కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని.. టెస్లా కార్లకంటే కూడా ఇవి తక్కువ ధరలో లభించడం వల్ల టెస్లా అమ్మకాలు క్షీణించాయని చెబుతూ.. గత త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు బాగా తగ్గినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment