వాషింగ్టన్: హోండా కంపెనీ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్ లోపాలకారణంగా అమెరికాలో 1.6 మిలియన్ వాహనాలను రీకాల్ చేస్తామని హోండా శుక్రవారం తెలిపింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించిన గడువుకు ఆరు నెలల ముందే ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లోపభూయిష్ట టకాటా ఎయిర్ బ్యాగ్‌లను రీప్లేస్ చేస్తామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ కార్లను, అమెరికాలో దాదాపు 12.9 మిలియన్ల హోండా, అకూరా ఆటోమొబైల్స్ కార్లను రీప్లేస్ చేశామని పేర్కొంది. కాగా 2013 నుండి తకాటా ఎయిర్‌బ్యాగ్‌లలోని లోపాలతో సంభవించిన ప్రమాదాల్లో సుమారు 20 మంది మరణించారు. దీంతో అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సీరియస్‌గా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment