షెవర్లే క్రూజ్ వెహికల్స్ భారీ రీకాల్ | General Motors India recalls 22,000 units of Chevrolet Cruze | Sakshi
Sakshi News home page

షెవర్లే క్రూజ్ వెహికల్స్ భారీ రీకాల్

Published Thu, Sep 1 2016 4:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

షెవర్లే క్రూజ్ వెహికల్స్ భారీ రీకాల్

షెవర్లే క్రూజ్ వెహికల్స్ భారీ రీకాల్

న్యూఢిల్లీ:  ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్  ఇండియా  దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది.  ప్రీమియం సెడాన్  మోడల్  షెవర్లే క్రూజ్ (పెట్రోల్) 22 వేల వాహనాలను రీకాల్ చేయనుంది.   ఇగ్నిషన్ సిస్టం లో లోపాల కారణంగా  2009-11 మధ్య  ఉత్పత్తి అయిన ఈ మోడళ్లను వెనక్కి   తీసుకోనున్నట్టు కంపెనీ   ప్రకటించింది.  ఈలోపంకారంగా వాహనం వేగం తగ్గుతోందని, ఈ లోపాన్ని సవరించే ఉద్దేశంతో వీటిని రీకాల్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  దేశ వ్యాప్తంగా ఈ   రీపేర్ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది. 

తక్కువ వాహనం వేగం,   ఇగ్నిషన్ , ఇంజిన్  లోపాన్ని  పరిష్కరించడానికి ఈ రీకాల్ చేపడుతుందని జనరల్ మోటార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తనిఖీకి లేదా  మరమ్మతుకు  ఒక్క కంటే ఎక్కువ పమయం పట్టదనీ తాము అంచనావేస్తున్నామని తెలిపింది.    వినియోగదారులు సమీపంలో తమ డీలర్ ను  సంప్రదించాలని  కోరింది.  వాహన భద్రతపై ఎలాంటి ప్రభావితం లేనప్పటికీ, ఇదొక స్వచ్ఛంద రీకాల్ అనీ, తమ వినియోగదారుల అనుభవాలను  నిర్ధారించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జనరల్ మోటార్స్ భారతదేశం వైస్ ప్రెసిడెంట్ - మార్కస్ స్టెర్ బర్గ్ తెలిపారు.

కాగా 2013లో    దాదాపు 1.14 షెవర్లే తవేరా యూనిట్లను   రీకాల్ చేసిన సంగతి తెలిసిందే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement