General Motors India
-
ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగాల కోతను ధ్రువపరుస్తూ జనరల్ మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుత్ వాహనాల వృద్ధి కొనసాగుతుండడంతో ఈ విభాగంలో అధికంగా పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది.‘భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. వాటి తయారీ, అందులో వాడే సాఫ్ట్‌వేర్‌కు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ వ్యయాలను రెండు బిలియన్ డాలర్ల (రూ.16,884 కోట్లు) నుంచి నాలుగు బిలియన్ డాలర్లు(రూ.33,768 కోట్లు) వరకు తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఈ పోటీ మార్కెట్లో గెలవాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకుని, సామర్థ్యాల వినియోగాన్ని పెంచుకోవాలి. ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నాం’ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపుఆగస్టులో ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో సాఫ్ట్వేర్ విభాగంలో పనిచేసే 1,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని గతంలో జనరల్ మోటార్స్ తొలగించింది. సెప్టెంబర్‌లో కాన్సాస్ తయారీ కర్మాగారంలో దాదాపు 1,700 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. 2023లో దాదాపు 5,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
General Motors: 1,245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేసిన ప్రఖ్యాత సంస్థ
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధభయాలు, అనిశ్చితి వాతావరణంలో కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ప్రధానంగా ఉద్యోగుల జీతభత్యాలు కంపెనీలకు భారంగా మారుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా జనరల్ మోటార్స్ సంస్థ 1245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రెజిల్ దేశంలోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న సావో జోస్ డోస్ క్యాంపస్, సావో కేటానో డో సుల్, మోగి దాస్ క్రూజెస్లోని ఫ్యాక్టరీల్లో జనరల్ మోటార్స్ 1,245 ఉద్యోగుల తొలగింపును రద్దు చేయనున్నట్లు అక్కడి కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ ఇటీవల తెలిపింది. ముందుగా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అందుకు విరుద్ధంగా కార్మికులు బ్రెజిలియన్ లేబర్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఉద్యోగుల తొలగింపును కొనసాగించడానికి అనుమతి కోసం సంస్థ సైతం కోర్టుకెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విచారించిన కోర్టు..కంపెనీ అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో మరుసటి రోజు జనరల్‌మోటార్స్ ఈ ప్రకటన చేసింది. ఇదీ చదవండి: ఎలాన్‌మస్క్ కుమారుడికి ఇండియన్ సైంటిస్ట్ పేరు జనరల్ మోటార్స్ అమెరికాకు చెందిన వాహన తయారీ సంస్థ. కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని మిచిగాన్‌లో ఉంది. జనరల్ మోటార్స్ చెవ్రొలెట్, జీఎంసీ, కాడిలాక్, బ్యూక్ తో సహా పలు ప్రసిద్ధ ఆటోమొబైల్ బ్రాండ్లను తయారుచేస్తుంది. 2022 నాటికి జనరల్ మోటార్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,67,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2016లో కంపెనీ ఉద్యోగులు 2,25,000 మంది ఉండేవారు. -
హ్యుందాయ్ చేతికి జీఎం ప్లాంట్.. కొత్త వ్యూహాలు సిద్ధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న జనరల్ మోటార్స్ (జీఎం) ఇండియాకు చెందిన తాలేగావ్ ప్లాంటును కొనుగోలు చేయనుంది. డీల్ పూర్తయితే స్థలం, భవనాలు, యంత్రాలు హ్యుందాయ్ పరం కానున్నాయి. ఇందుకోసం జీఎం ఇండియాతో టెర్మ్ షీట్ ఒప్పందం చేసుకున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సోమవారం ప్రకటించింది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ప్లాంటు చేతికి వచ్చిన తర్వాత తొలుత వెన్యూ ఎస్‌యూవీని ఈ కేంద్రంలో తయారు చేసి ఎగుమతి చేయాలన్నది హ్యుందాయ్ ఆలోచన. 2028 నాటికి భారత్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 6 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూరు వద్ద ఉన్న హ్యుందాయ్ ప్లాంటు దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. భారత్‌తోపాటు విదేశాల నుంచి కంపెనీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అదనపు తయారీ సామర్థ్యం ఇప్పుడు సంస్థకు తప్పనిసరి. -
జనరల్ మోటార్స్ వాహనాల ధరలూ పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: వాహన కంపెనీలన్నీ కార్ల ధరల పెంపులో నిమగ్నమయ్యాయి. టయోటా, నిస్సాన్, రెనో, టాటా మోటార్స్, మెర్సిడెస్, హ్యుందాయ్ ఇలా కంపెనీలన్నీ ఇప్పటికే వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించేశాయి. ఇప్పుడు జనరల్ మోటార్స్ ఇండియా కూడా వీటి సరసన చేరింది. ఇది తాజాగా జనవరి 1 నుంచి వాహన ధరలను దాదాపు రూ.30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫారెక్స్ రేట్లలో ఒడిదుడుకులు, ముడిపదార్థాల ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయం ఎగయడం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. -
షెవర్లే క్రూజ్ వెహికల్స్ భారీ రీకాల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ప్రీమియం సెడాన్ మోడల్ షెవర్లే క్రూజ్ (పెట్రోల్) 22 వేల వాహనాలను రీకాల్ చేయనుంది. ఇగ్నిషన్ సిస్టం లో లోపాల కారణంగా 2009-11 మధ్య ఉత్పత్తి అయిన ఈ మోడళ్లను వెనక్కి తీసుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈలోపంకారంగా వాహనం వేగం తగ్గుతోందని, ఈ లోపాన్ని సవరించే ఉద్దేశంతో వీటిని రీకాల్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఈ రీపేర్ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది. తక్కువ వాహనం వేగం, ఇగ్నిషన్ , ఇంజిన్ లోపాన్ని పరిష్కరించడానికి ఈ రీకాల్ చేపడుతుందని జనరల్ మోటార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తనిఖీకి లేదా మరమ్మతుకు ఒక్క కంటే ఎక్కువ పమయం పట్టదనీ తాము అంచనావేస్తున్నామని తెలిపింది. వినియోగదారులు సమీపంలో తమ డీలర్ ను సంప్రదించాలని కోరింది. వాహన భద్రతపై ఎలాంటి ప్రభావితం లేనప్పటికీ, ఇదొక స్వచ్ఛంద రీకాల్ అనీ, తమ వినియోగదారుల అనుభవాలను నిర్ధారించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జనరల్ మోటార్స్ భారతదేశం వైస్ ప్రెసిడెంట్ - మార్కస్ స్టెర్ బర్గ్ తెలిపారు. కాగా 2013లో దాదాపు 1.14 షెవర్లే తవేరా యూనిట్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే -
క్రూజ్ ధర తగ్గించిన జనరల్ మోటార్స్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా తాజాగా షెవర్లే క్రూజ్ కొత్త వెర్షన్ ధరను రూ.86,000 వరకు తగ్గించింది. క్రూజ్ మోడల్ అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా కంపెనీ ఈ చర్య తీసుకుంది. కంపెనీ క్రూజ్ కొత్త వెర్షన్‌ను జనవరి 30న మార్కెట్లో విడుదల చేసింది. అప్పుడు దీని ధర రూ.14.68 లక్షలు-రూ.17.81 లక్షల శ్రేణిలో ఉంది. ఇప్పుడు ధర రూ.13.95 లక్షలు-రూ.16.95 లక్షల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. క్రూజ్ ఎల్టీ ఎంటీ వేరియంట్ ధర రూ.73,000 తగ్గుదలతో రూ.14.68 లక్షల నుంచి రూ.13.95 లక్షలకు, క్రూజ్ ఎల్టీజెడ్ ఎంటీ వేరియంట్ ధర రూ.80,000 తగ్గుదలతో 16.75 లక్షల నుంచి రూ.15.95 లక్షలకు చేరనున్నాయి. -
పెరగనున్న జనరల్ మోటార్స్ వాహనాల ధరలు
న్యూఢిల్లీ : జనరల్ మోటార్స్ ఇండియా వాహనాల ధరలను మళ్లీ పెంచడానికి రంగం సిద్ధంచేస్తోంది. దీంతో వచ్చే నెల నుంచి కంపెనీకి చెందిన పలు వాహనాల ధరలు 2 శాతంమేర పెరగనున్నాయి. వాహన ధరల పెంపునకు విదేశీ మారక ద్రవ్యంలో ఒడిదుడుకులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎంట్రీ లెవెల్ కారు స్పార్క్‌తో కలుపుకొని జనరల్ మోటార్స్ దేశంలో ఎనిమిది మోడళ్లను విక్రయిస్తోంది. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియడం వల్ల కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో (జనవరిలో) వాహనాల ధరలను రూ.61,000 వరకూ పెంచిన విషయం తెలిసిందే. -
షెవర్లే క్రూజ్.. కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ షెవర్లే క్రూజ్ మోడల్లో కొత్త వెర్షన్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.13,75,580 నుంచి రూ.16.15 లక్షల రేంజ్లో ఉన్నాయి. 2 లీటర్ వీడీ సీఐ డీజిల్ ఇంజిన్ ఉన్న ఈ కారు ఏడు రంగుల్లో లభ్యమవుతుంది. డ్రైవర్ సీట్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఈ కారులో 4 ఎయిర్ బ్యాగ్స్, క్లచ్ ఫుట్ రెస్ట్, ప్రీమియం స్పీకర్లు, 6 స్పీడ్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. 17.3 కిలోమీటర్ల మైలేజీ నిచ్చే ఈ కారు 0-100 కి.మీ.లను 9 సెకన్లలో చేరుకుంటుందని, గరిష్ట వేగం 200 కిమీ/గం. అని కంపెనీ పేర్కొంది. ఈ కారు స్కోడా ఆక్టేవియా, హ్యుందాయ్ ఎలంట్ర, ఫోక్స్‌వ్యాగన్ జెటా, రేనాల్ట్ ఫ్లూయెన్స్లతో పోటీపడనుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా 2009లో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని, అప్పటి నుంచి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ, లొవెల్ పాడాక్ చెప్పారు. -
‘సియాం’ కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్
న్యూఢిల్లీ: సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ ఎన్నికయ్యారని సియాం తెలిపింది. ఆయన టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సియాం కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి, కోశాధికారిగా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ లొవెల్ పాడాక్లు ఎన్నికయ్యారని సియాం పేర్కొంది. భారత వాహన పరిశ్రమకు ఉన్నత స్థానాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. భారత వాహన పరిశ్రమ తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉండడమే కాకుండా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే గురుతర బాధ్యతను కూడా నిర్వర్తిస్తోందని చెప్పారు.