జనరల్ మోటార్స్ వాహనాల ధరలూ పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: వాహన కంపెనీలన్నీ కార్ల ధరల పెంపులో నిమగ్నమయ్యాయి. టయోటా, నిస్సాన్, రెనో, టాటా మోటార్స్, మెర్సిడెస్, హ్యుందాయ్ ఇలా కంపెనీలన్నీ ఇప్పటికే వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించేశాయి. ఇప్పుడు జనరల్ మోటార్స్ ఇండియా కూడా వీటి సరసన చేరింది. ఇది తాజాగా జనవరి 1 నుంచి వాహన ధరలను దాదాపు రూ.30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫారెక్స్ రేట్లలో ఒడిదుడుకులు, ముడిపదార్థాల ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయం ఎగయడం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది.