షెవర్లే క్రూజ్.. కొత్త వెర్షన్ | Sevarle Cruise .. The new version | Sakshi
Sakshi News home page

షెవర్లే క్రూజ్.. కొత్త వెర్షన్

Published Fri, Oct 25 2013 1:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

షెవర్లే క్రూజ్..   కొత్త వెర్షన్

షెవర్లే క్రూజ్.. కొత్త వెర్షన్

 న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ కంపెనీ షెవర్లే క్రూజ్ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ  కారు ధరలు రూ.13,75,580 నుంచి రూ.16.15 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.  2 లీటర్ వీడీ సీఐ డీజిల్ ఇంజిన్ ఉన్న ఈ కారు ఏడు రంగుల్లో లభ్యమవుతుంది. డ్రైవర్ సీట్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఈ కారులో 4 ఎయిర్ బ్యాగ్స్, క్లచ్ ఫుట్ రెస్ట్, ప్రీమియం స్పీకర్లు, 6 స్పీడ్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. 17.3 కిలోమీటర్ల మైలేజీ నిచ్చే ఈ కారు 0-100 కి.మీ.లను 9 సెకన్లలో చేరుకుంటుందని, గరిష్ట వేగం 200 కిమీ/గం. అని కంపెనీ పేర్కొంది.
 
  ఈ కారు స్కోడా ఆక్టేవియా, హ్యుందాయ్ ఎలంట్ర, ఫోక్స్‌వ్యాగన్ జెటా, రేనాల్ట్ ఫ్లూయెన్స్‌లతో పోటీపడనుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా 2009లో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని, అప్పటి నుంచి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ, లొవెల్ పాడాక్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement