‘సియాం’ కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ | Vikram Kirloskar is new SIAM President | Sakshi
Sakshi News home page

‘సియాం’ కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్

Published Sat, Sep 7 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ ఎన్నికయ్యారని సియాం తెలిపింది.

న్యూఢిల్లీ: సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ ఎన్నికయ్యారని సియాం తెలిపింది. ఆయన టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సియాం కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి, కోశాధికారిగా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ లొవెల్ పాడాక్‌లు ఎన్నికయ్యారని సియాం పేర్కొంది. భారత వాహన పరిశ్రమకు ఉన్నత స్థానాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. భారత వాహన పరిశ్రమ తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉండడమే కాకుండా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే గురుతర బాధ్యతను కూడా నిర్వర్తిస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement