Vinod Dasari
-
ఎలక్ట్రిక్ ట్రక్కు కంపెనీ ట్రెసా మోటర్స్ చైర్మన్‌గా వినోద్ దాసరి
బెంగళూరుకు చెందిన మీడియం, హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ ట్రెసా మోటర్స్ బోర్డు ఛైర్మన్‌గా వినోద్ కె దాసరిని నియమించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో వినోద్‌కు ఉన్న విశేష అనుభవం తమ కంపెనీ దేశీయ మార్కెట్లో పట్టు సాధించడంతోపాటు అంతర్జాతీయ వ్యాపార అవకాశాల అన్వేషణకు తోడ్పడుతుందని ట్రెసా మోటార్స్ విశ్వసిస్తోంది. ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి? వినోద్ దాసరి గతంలో రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓగా, అశోక్ లేలాండ్ సీఈవో, ఎండీగా పనిచేశారు. అపెక్స్ ఇండస్ట్రీ బాడీ ఎస్ఐఏఎంకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2016లో ఆటోకార్ ప్రొఫెషనల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ట్రెసా మోటర్స్ చైర్మన్‌గా వినోద్ దాసరి నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. ట్రెసా మోటర్స్‌లో కీలక బాధ్యతలను చేపట్టనున్న ఆయన కంపెనీ వ్యూహాత్మక దిశానిర్దేశం, ఆవిష్కరణలను నడపడంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ట్రెసా మోటార్స్ కుటుంబానికి వినోద్ కె దాసరిని స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రోహన్ శ్రవణ్ అన్నారు. ఆటోమోటివ్ రంగంలో వినోద్ విశేష అనుభవం, అద్భుతమైన విజయాలు తమ కంపెనీ వృద్ధి ప్రయాణానికి కీలక వనరులుగా మారుతాయని, ఆయన నాయకత్వంలో ట్రెసా మోటర్స్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రెసా మోటర్స్ ఛైర్మన్‌గా తన నియామకంపై వినోద్ కె దాసరి మాట్లాడుతూ, ట్రెసా మోటార్స్‌లో చేరడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు ట్రెసా మోటర్స్ కంపెనీని 2022లో రోహన్ శ్రవణ్, రవి మచాని స్థాపించారు. పారిశ్రామిక డిజైన్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, బ్యాటరీ సంబంధిత టెక్నాలజీలో ఈ కంపెనీకి విశేష సామర్థ్యం ఉంది. ఇది ప్రస్తుతం 18T-55T GVW విభాగంలో ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. దాని మొదటి వాహనం మోడల్ V0.1ని ఇటీవలె ఆవిష్కరించింది. అధికారిక ఉత్పత్తి లాంచ్ 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జరగనుంది. -
పదివేల వాహనాలపై బీఎస్3 ప్రభావం
► అయినా తక్కువగానే ఆర్థిక నష్టం ► బీఎస్4 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేస్తున్నాం ► అశోక్ లేల్యాండ్ ఎండీ వినోద్ దాసరి చెన్నై: బీఎస్3 వాహనాల నిషేధంతో తమ వాణిజ్య వాహనాల్లో సుమారు 10,664 యూనిట్లపై ప్రతికూల ప్రభావం పడిందని అశోక్ లేల్యాండ్ తెలిపింది. అయితే, వీటిని అప్‌గ్రేడ్ చేయనుండటం వల్ల ఆర్థిక నష్టం తక్కువ స్థాయిలోనే ఉండగలదని పేర్కొంది. తాము కొత్తగా రూపొందించిన ఇంటెలిజెంట్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ (ఐఈజీఆర్) టెక్నాలజీతో బీఎస్3 ఇంజిన్లను బీఎస్4 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అశోక్ లేల్యాండ్ ఎండీ వినోద్ దాసరి తెలిపారు. మొత్తం 10,664 బీఎస్3 వాహనాల్లో 95% వాహనాలు డీలర్ల దగ్గర కాకుండా తమ వద్దే ఉన్నాయని ఆయన వివరించారు. వీటిని ఐఈజీఆర్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి ఇంజిన్‌కు సుమారు రూ. 20,000 మాత్రమే ఖర్చవుతుందని, వీటిని ఆఫ్టర్‌మార్కెట్ సేల్స్‌లో కొంత ప్రీమియం ధరకు విక్రయిస్తామని వినోద్ దాసరి చెప్పారు. ‘సాధారణంగా బీఎస్3 ఇంజిన్ ధర సుమారు రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసిన వాటిని దాదాపు రూ. 2 లక్షలకు విక్రయించవచ్చు. కాబట్టి ఆ రకంగా బీఎస్3 నిషేధ ప్రభావాలు మా మీద తక్కువగానే ఉండగలవు‘ అని ఆయన వివరించారు. రూ. 600 కోట్ల పెట్టుబడులు.. క్యాబిన్, ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు కెన్యా, ఐవరీ కోస్ట్‌లలో కొత్తగా అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ. 600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు వినోద్ చెప్పారు. దేశీయంగా వాణిజ్య వాహనాల మార్కెట్ పరిస్థితులు ఆశావహంగా ఉన్నాయని, పరిశ్రమ ఈ ఏడాది సుమారు 10–15% వృద్ధి సాధించవచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్, కెన్యా, ఐవరీ కోస్ట్‌లో చిన్న ప్లాంట్ల ఏర్పాటుపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. ఇవి ప్రాథమికంగా నెలకు 200 యూనిట్ల సామర్ధ్యంతో పనిచేస్తాయని, తర్వాత 400 యూనిట్లకు పెంచుకోవచ్చన్నారు. తూర్పు ఆఫ్రికాలోని దేశాల కోసం కెన్యా ప్లాంటులో, పశ్చిమ ఆఫ్రికా దేశాల మార్కెట్ కోసం ఐవరీ కోస్ట్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు వినోద్ వివరించారు. -
‘సియాం’ కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్
న్యూఢిల్లీ: సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ ఎన్నికయ్యారని సియాం తెలిపింది. ఆయన టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సియాం కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి, కోశాధికారిగా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ లొవెల్ పాడాక్లు ఎన్నికయ్యారని సియాం పేర్కొంది. భారత వాహన పరిశ్రమకు ఉన్నత స్థానాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. భారత వాహన పరిశ్రమ తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉండడమే కాకుండా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే గురుతర బాధ్యతను కూడా నిర్వర్తిస్తోందని చెప్పారు.