క్రూజ్ ధర తగ్గించిన జనరల్ మోటార్స్ | General Motors has reduced the price of the cruise | Sakshi
Sakshi News home page

క్రూజ్ ధర తగ్గించిన జనరల్ మోటార్స్

Published Fri, Feb 26 2016 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

క్రూజ్ ధర  తగ్గించిన  జనరల్ మోటార్స్

క్రూజ్ ధర తగ్గించిన జనరల్ మోటార్స్

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా తాజాగా షెవర్లే క్రూజ్ కొత్త వెర్షన్ ధరను రూ.86,000 వరకు తగ్గించింది. క్రూజ్ మోడల్ అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా కంపెనీ ఈ చర్య తీసుకుంది. కంపెనీ క్రూజ్ కొత్త వెర్షన్‌ను జనవరి 30న మార్కెట్‌లో విడుదల చేసింది. అప్పుడు దీని ధర రూ.14.68 లక్షలు-రూ.17.81 లక్షల శ్రేణిలో ఉంది. ఇప్పుడు ధర రూ.13.95 లక్షలు-రూ.16.95 లక్షల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. క్రూజ్ ఎల్‌టీ ఎంటీ వేరియంట్ ధర రూ.73,000 తగ్గుదలతో రూ.14.68 లక్షల నుంచి రూ.13.95 లక్షలకు, క్రూజ్ ఎల్‌టీజెడ్ ఎంటీ వేరియంట్ ధర రూ.80,000 తగ్గుదలతో 16.75 లక్షల నుంచి రూ.15.95 లక్షలకు చేరనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement