మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, స్కోడా & నిస్సాన్ వంటి ప్రధాన వాహన తయారీదారులు భారతీయ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో స్కోడా కైలాక్, అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ, కియా సిరోస్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ వంటివి ఉన్నాయి.
స్కోడా కైలాక్
స్కోడా కంపెనీ 2025 మార్చిలో కైలాక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఇది MQB A0 IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారువుతోంది. కాబట్టి కుషాక్‌లోని చాలా ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో 1.0 లీ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.
అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూ అప్డేటెడ్ మోడల్ 2025 మధ్య నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది చూడటానికి సాధారణ వెన్యూ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్, లేటెస్ట్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే మెకానికల్ అప్డేట్స్ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.
కియా సిరోస్
కియా కంపెనీ సిరోస్ కారును 2025 మొదటి అర్ధభాగంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది సోనెట్, సెల్టోస్ మధ్యలో ఉంటూ.. సోనెట్ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సన్‌రూఫ్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉండనున్నాయి.
ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్
ఇప్పటికే రెండు లక్షల అమ్మకాలను సాధించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. 2025 మధ్య నాటికి ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ పొందనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పనితీరు దాని స్టాండర్డ్ మోడల్ కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ధర, లాంచ్ డేట్ వంటి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment