2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్
2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్‌లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్‌లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్
భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా ఎక్స్‌యువీ300 ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్‌యువీ300 కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్‌కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా..
మహీంద్రా ఎక్స్‌యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్
జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్‌యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment