భారతీయ మార్కెట్లో ఒకప్పుడు ఉత్తమ అమ్మకాలు పొందిన 'మహీంద్రా మరాజో' ఉత్పత్తిని కంపెనీ త్వరలో నిలిపివేయనున్నట్లు సమాచారం. 2018లో మారుతి ఎర్టిగా, ఎక్స్ఎల్6, కియా కారెన్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా దేశీయ విఫణిలో అడుగుపెట్టిన మరాజో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఈ ఎమ్‌పీవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.90 లక్షల మధ్య ఉండేది.
ప్రారంభంలో ఉత్తమ అమ్మకాలు పొందినప్పటికీ.. క్రమంగా ఇది ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందలేకపోయింది. గత ఐదు నెలలో ఈ కారు కేవలం 34 యూనిట్ల అమ్మకాలను మాత్రమే సాధించింది. ప్రస్తుతం ప్యాసింజర్ ఎమ్‌పీవీ మార్కెట్లో టయోటా, మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో కంపెనీ మరాజో కారును నిలిపివేయడానికి సంకల్పించింది.
ప్రారంభం నుంచి జూన్ 2024 వరకు మహీంద్రా మరాజో సేల్స్ మొత్తం 44793 యూనిట్లు మాత్రమే. నెలకు సగటున కేవలం 640 యూనిట్ల మరాజో కార్లు మాత్రమే అమ్ముడైనట్లు కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలు తగ్గడమే కాకుండా.. బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అవ్వలేదు. ఇది కూడా కంపెనీ మార్కెట్లో విజయం పొందకపోవడానికి కారణమనే తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment