సాక్షి, అనంతపురం : కియా మోటార్స్‌పై చంద్రబాబు నాయుడు కుట్ర చేసి రాయిటర్స్ ద్వారా తప్పుడు వార్తలు యించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుత పాలనను చూసి చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
కియాపై తప్పుడు ప్రచారం చేసినందుకుగాను చంద్రబాబు కియా పరిశ్రమ వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని, ప్రతి విషయంలో ద్వంద్వ వైఖరి పాటిస్తారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ అత్యవసరమని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. రాయలసీమలో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల సీమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల మేలు కోసమే సీఎం జగన్ వికేంద్రీకరణ చేపట్టారని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment