కృష్ణా: టీడీపీ నేతలపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ నేతలకు దమ్ముంటే మాధవ్‌కు సంబంధించిన అసలు వీడియో బయటపెట్టాలని సవాల్ విసిరారు. మహిళలను అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేస్తున్న చరిత్ర టీడీపీదని కొడాలి నాని ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. పోలీసులు ఫేక్ వీడియో అని చెప్పినా రాద్దాంతం చేస్తున్నారని, ఐటీడీఏ, లోకేశ్, చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఫేక్ వీడియోను స్పష్టించారని కొడాలి నాని పేర్కొన్నారు.టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment