కర్నూలు (అర్బన్), అనంతపురం సప్తగిరి సర్కిల్/ గుత్తి రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల ఫేక్, మార్ఫింగ్ వీడియోలను మీ చేతికిస్తే ప్రసారం చేస్తారా? అని ఎల్లో మీడియా యాజమాన్యాలను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా నిజానిజాలను తెలుసుకొని ప్రసారం చేయాలని సూచించారు. ఆదివారం ఆయన పంచలింగాల చెక్‌పోస్టు, ఊబిచెర్ల, అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
బీసీ వర్గానికి చెందిన తనను అణగదొక్కేందుకు ఫేక్ వీడియోలు సృష్టించి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, నేరుగా ఎదుర్కోలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరే పోలీస్‌గా, ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా, చివరికి జడ్జిగా మారి తనను దోషిగా నిర్ధారించేందుకు కంకణం కట్టుకున్నారని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. యూకే నుంచి ఐటీడీపీకి అప్‌లోడ్ చేసిన ఫేక్, మార్ఫింగ్ వీడియోను ఎల్లో మీడియా చానెళ్లు ప్రసారం చేశాయన్నారు.
కమ్మ కులానికి చంద్రబాబు చేటు
నీళ్లకు పాచి చేటని, అలాగే కమ్మ కులానికి చంద్రబాబు చేటని ఎంపీ మాధవ్ విమర్శించారు. ఏ కులమూ కమ్మ వారికి వ్యతిరేకం కాదని, కేవలం చంద్రబాబుకు మాత్రమే వ్యతిరేకమనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. కమ్మ కులస్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేశారన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంపై చర్చలు పెట్టే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేష్ వీడియోలను ప్రసారం చేస్తారా?
Published Mon, Aug 15 2022 4:02 AM | Last Updated on Mon, Aug 15 2022 10:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment