సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర నుంచి పాలన ఏర్పాట్లపై ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని, పరిపాలనా రాజధానిగా విశాఖపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు రాస్తోందని ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు బాగుండాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారన్నారు.
విశాఖపై విషం..
‘‘ఇక్కడ నుంచి జీవితం ప్రారంభించిన రామోజీరావు విశాఖపై విషం చిమ్ముతున్నారు. అమరావతిలో పెట్టుబడులు పోతాయని ఇలా రామోజీ చేస్తున్నారు. సామర్లకోట సభలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆయనపై విమర్శలు చేస్తున్న నాయకులు ఎన్‌ఆర్‌ఐలు. పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ నాన్ లోకల్. ఇప్పుడు చంద్రబాబు జైల్లో వున్న 30 రోజులు మినహాయిస్తే నాలుగేళ్లలో ఎప్పుడైనా వారం రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వున్నారా?’’ అంటూ మంత్రి గుడివాడ ప్రశ్నించారు.
రాధాకృష్ణ ఎలా కోట్లకు పడగలెత్తారు?
‘‘అసలు 3 దశాబ్దాల్లో ఎప్పుడైనా ఏపీలో కానీ, కుప్పంలో గానీ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు రాలేదా?. ఇక పవన్ కళ్యాణ్ ఏపీనీ పొలిటికల్ టూరిస్ట్‌గా వాడుతున్నారు. పవన్ పోటీ చేయడానికి ఏపీ కావాలి.. గాజువాక కావాలి.. కానీ ఇక్కడ నివాసం వుండాలని అనుకోరు. రోశయ్య గారు చెప్పేవారు. సైకిల్ చైన్ ఉడిపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ఛాంబర్‌కి వచ్చి శుభ్రం చేసుకొనేవారనీ. ఇప్పుడు రాధాకృష్ణ ఎలా కోట్లకు పడగలెత్తారు.’’ అని మంత్రి నిలదీశారు.
గీతం భూ ఆక్రమణలు కనిపించవా?
‘‘టీడీపీ అండ్ కో ఏపీనీ అవసరాలకు వాడుకుంటుంది. రుషి కొండ గురించి మాట్లాడే నాయకులకు గీతం భూ ఆక్రమణలు కనిపించవా ?. 27 ఎకరాలు భూమిని ఆక్రమించిన గీతం యాజమాన్యం నుంచి దాదాపు వెయ్యి కోట్ల విలువ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. టీడీపీ రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తే, జగన్ ప్రభుత్వం జనం కోసం ఆలోచిస్తుంది’’ అని మంత్రి పేర్కొన్నారు.
జైలుకు వెళ్లక ముందే ఉంది..
‘‘చంద్రబాబు జైల్‌కి వెళ్లినప్పుడు 66 కిలోలు.. ఇప్పుడు 67 కేజీలు వున్నారు. జైల్లో చంద్రబాబు కిలో బరువు పెరిగారు. చంద్రబాబు అధికారుల పర్యవేక్షణలో భద్రంగా వున్నారు. కానీ కుటుంబ సభ్యులు బాబు ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అసలు బాబు కుటుంబంపై అనుమానం కలుగుతుంది. చంద్రబాబుకు ఇంటి నుంచి పంపించే భోజనం లోకేష్‌కు పెట్టీ పంపించాలి. చంద్రబాబు కొత్తగా అలెర్జీ రాలేదు.. జైలుకు వెళ్లక ముందే ఉంది’’ అని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.
చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment