సాక్షి, విశాఖపట్నం: దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని.. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన (Davos Tour)ను ఉపయోగించుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని.. లోకేష్ భజనతో దావోస్ ముగిసిందన్నారు.
‘‘కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు?. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బ తీశారు. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. దావోస్‌లో కూడా లోకేష్ భజన చేశారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టు బడులు ఇతర రాష్ట్రాలకు తరలించారు. పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేశారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు’’ అంటూ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.
‘‘బల్క్ డ్రగ్ పార్క్ వైఎస్సార్‌సీపీ హయాంలో వచ్చింది. ప్రధాని శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ గ్రీన్ హబ్ వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చింది. ఒక హామీ ఒక స్కీం కూడా అమలు చేయలేదు. నమ్మే వాళ్ళు ఉంటే బిల్ గేట్స్ చంద్రబాబు కలిసి చదువుకున్నాము అంటాడు. చంద్రబాబు బ్రాండ్ ఇమెజ్ పెంచుకోవడానికి దావొస్ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదు.’’ అంటూ గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్: లేళ్ల అప్పిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment